BREAKING
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ప్రోత్సహించడం అభినందనీయం. సార్సాలలో విఓ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్సీ. పల్లెలకు పాకిన గంజాయి మత్తు!? ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నేటి బాలలే రేపటి దేశానికి మార్గదర్శకులు సర్పంచ్ పోలు సంపత్ చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై సమీక్షా సమావేశం తాగునీటి సరఫరా నివారణకు వెంటనే ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి 5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి లను అందించిన ఎమ్మెల్యే గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి-టీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక నవంబర్ 26న మున్సిపల్ ఎన్నికలు.. 87 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు 188 వార్డులకు 443 పోలింగ్ స్టేషన్లు.. భద్రతపై ప్రత్యేక దృష్టి ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు జగద్గురువుల దర్శనానికి సర్వం సిద్ధం - ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు

ప్రజల ఆరోగ్యంతో అధికారుల చెలగాటం! పట్టణంలో ఎక్కడ చూసినా అనధికారిక అల్పాహార కేంద్రాలే... నాణ్యత లేని ఆహార పదార్థాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు! నిబంధనలు గాలికి.. అధికారుల పర్యవేక్షణ కరువు.. పట్టించుకునే నాథుడే లేడా?

Select Suryaa Now
ప్రజల ఆరోగ్యంతో అధికారుల చెలగాటం!  పట్టణంలో ఎక్కడ చూసినా అనధికారిక అల్పాహార కేంద్రాలే...  నాణ్యత లేని ఆహార పదార్థాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు!  నిబంధనలు గాలికి.. అధికారుల పర్యవేక్షణ కరువు..  పట్టించుకునే నాథుడే లేడా?

రేపల్లె మేజర్ న్యూస్; పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను మరిచిపోయారా? ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత వ్యాపారులకు లేదా? ఆహార భద్రతా ప్రమాణాలను పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నలు ప్రస్తుతం పట్టణ ప్రజల్లో తీవ్రంగా వినిపిస్తున్నాయి. పట్టణంలో వీధివీధికి, సందుసందుకి అనధికారికంగా అల్పాహార కేంద్రాలు, బిర్యానీ విక్రయ కేంద్రాలు, నూడిల్స్ బండ్లు, టిఫిన్, చికెన్ పకోడీ, సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా సంబంధిత అధికారుల పర్యవేక్షణ మాత్రం కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తక్కువ ధరకే బిర్యానీ అంటూ మైకుల్లో భారీ ప్రచారాలు చేస్తూ ప్రజలను ఆకర్షిస్తున్న కొందరు వ్యాపారులు ఆహార పదార్థాల తయారీలో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారు? వంటకు ఉపయోగిస్తున్న ముడి పదార్థాలు నాణ్యమైనవేనా? వంట నూనెలను ఎంతకాలం ఉపయోగిస్తున్నారు? ఆహార పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్నారా? అనే అంశాలపై అధికారుల తనిఖీలు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా ప్రధాన రహదారుల వెంబడి మాంసాహార వంటకాలను తయారు చేస్తూ విక్రయిస్తున్న కొన్ని కేంద్రాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. మాంసం ఫ్రై చేయడానికి ఉపయోగిస్తున్న నూనెల పరిస్థితి, వంట సామగ్రి పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానాలను పరిశీలిస్తే పారిశుద్ధ్య ప్రమాణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలో ఆహార పదార్థాల తయారీకి అనుమతులు ఉన్నాయా? కనీస పరిశుభ్రత పాటిస్తున్నారా? అన్నది అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది.

ప్రజల ప్రాణాల కంటే వ్యాపారమే ముఖ్యమా?

ఆహార భద్రత అనేది ప్రజల ప్రాథమిక ఆరోగ్యానికి సంబంధించిన అంశం. నాణ్యత లేని నూనెలు, కలుషితమైన ముడి పదార్థాలు, అపరిశుభ్రమైన వంట పరిసరాల్లో తయారయ్యే ఆహారం ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అయినప్పటికీ పట్టణంలో ఎక్కడపడితే అక్కడ ఆహార విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తూ వ్యాపారాలు సాగిస్తున్నా సంబంధిత శాఖల అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అల్పాహార కేంద్రాలు నిర్వహించేవారు తప్పనిసరిగా ఆహార భద్రతా నిబంధనలు పాటిస్తున్నారా? అవసరమైన లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు కలిగి ఉన్నారా? వంటకు ఉపయోగించే నూనె నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారా? తాగునీరు, వంటగది, ఆహార నిల్వ ప్రదేశాల్లో పరిశుభ్రత ఉందా? అనే అంశాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

ఇప్పటికైనా అధికారులు మేల్కొంటారా?

మున్సిపల్ అధికారులు, ఆహార భద్రతా శాఖ అధికారులు సంయుక్తంగా పట్టణంలోని అన్ని అల్పాహార కేంద్రాలు, బిర్యానీ పాయింట్లు, నూడిల్స్ బండ్లు, టిఫిన్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. అనుమతులు లేని కేంద్రాలను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, నాణ్యత లేని నూనెలు, కలుషితమైన పదార్థాలు వినియోగిస్తున్నట్లు తేలితే సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వ్యాపార విధానాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అధికారులదే. ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే అప్రమత్తమై తనిఖీలు చేపట్టడం మేలని పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ప్రజల ఆరోగ్యమే అధికారుల ప్రథమ ప్రాధాన్యత కావాలి. ఆదాయం కోసం వ్యాపారాలు చేసుకునే వారికి నిబంధనలు వర్తించవా? ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిద్రమత్తు వీడి క్షేత్రస్థాయిలో పర్యటించి ఆహార భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని పట్టణ ప్రజలు గట్టిగా కోరుతున్నారు.