BREAKING
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ప్రోత్సహించడం అభినందనీయం. సార్సాలలో విఓ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్సీ. పల్లెలకు పాకిన గంజాయి మత్తు!? ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నేటి బాలలే రేపటి దేశానికి మార్గదర్శకులు సర్పంచ్ పోలు సంపత్ చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై సమీక్షా సమావేశం తాగునీటి సరఫరా నివారణకు వెంటనే ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి 5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి లను అందించిన ఎమ్మెల్యే గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి-టీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక నవంబర్ 26న మున్సిపల్ ఎన్నికలు.. 87 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు 188 వార్డులకు 443 పోలింగ్ స్టేషన్లు.. భద్రతపై ప్రత్యేక దృష్టి ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు జగద్గురువుల దర్శనానికి సర్వం సిద్ధం - ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు

బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక

Select Suryaa Now
బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక

మెదక్ ప్రతినిధి ; బాలల హక్కుల పరిరక్షణ, వారి సమస్యలు మరియు అభిప్రాయాలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలో పిల్లల ప్రజావాణి  కార్యక్రమాన్ని నవంబర్ 16, 2026న సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా నవంబర్ 14 నుండి 20 వరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా, ముఖ్యంగా నిరుపేద, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు తమ సమస్యలు, ఇబ్బందులు, ఫిర్యాదులు మరియు అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియజేసేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయ జిల్లా ప్రజావాణి నిర్వహించే ప్రదేశంలో ప్రత్యేకంగా పిల్లల ప్రజావాణి డెస్క్ఏర్పాటు చేసి, పిల్లల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు వారి సమస్యలను సావధానంగా విని సంబంధిత శాఖల ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకొనున్నామని చెప్పారు.ఈ కార్యక్రమంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, కార్మిక శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ తదితర సంబంధిత శాఖల అధికారులు పాల్గొని పిల్లలకు సంబంధించిన సమస్యలపై తక్షణ స్పందన తెలియజేయనున్నామన్నారు.బాలల భద్రత, విద్య, ఆరోగ్యం, పోషణ, రక్షణ, అభివృద్ధి, బాలలపై హింస, బాల కార్మికత్వం, బాల్యవివాహాలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత శాఖలకు పంపించి పరిష్కార చర్యలు చేపట్టనున్నారు.పిల్లల నుంచి స్వీకరించిన ప్రతి ఫిర్యాదును ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేసి, తీసుకున్న చర్యలు, పరిష్కార స్థితిని నిరంతరం పర్యవేక్షించనున్నారు. ఫిర్యాదులు స్వీకరించే సమయంలో పిల్లల గోప్యత, భద్రత మరియు గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నారు.పిల్లల గొంతుకను వినడం, వారి హక్కులను గౌరవించడం, వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపడం జిల్లా యంత్రాంగం బాధ్యత.** ఈ కార్యక్రమంలో పిల్లలు స్వచ్ఛందంగా పాల్గొని తమ సమస్యలను తెలియజేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చెప్పారు.బాలల హక్కుల పరిరక్షణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ, బాలలందరికీ సురక్షితమైన, ఆరోగ్యకరమైన మరియు హక్కులతో కూడిన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేయాలని తెలిపారు.