BREAKING
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ప్రోత్సహించడం అభినందనీయం. సార్సాలలో విఓ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్సీ. పల్లెలకు పాకిన గంజాయి మత్తు!? ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నేటి బాలలే రేపటి దేశానికి మార్గదర్శకులు సర్పంచ్ పోలు సంపత్ చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై సమీక్షా సమావేశం తాగునీటి సరఫరా నివారణకు వెంటనే ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి 5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి లను అందించిన ఎమ్మెల్యే గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి-టీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక నవంబర్ 26న మున్సిపల్ ఎన్నికలు.. 87 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు 188 వార్డులకు 443 పోలింగ్ స్టేషన్లు.. భద్రతపై ప్రత్యేక దృష్టి ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు జగద్గురువుల దర్శనానికి సర్వం సిద్ధం - ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు

ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి-టీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్

Select Suryaa Now
ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి-టీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్

సూర్య మంచిర్యాల: ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ డిమాండ్ చేశారు.శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే ముందు విద్యార్థులు, తల్లిదండ్రులు,అధ్యాపకులు, విద్యావేత్తలతో చర్చించాలని సూచించారు.ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో వేలాది జూనియర్ కళాశాలలు, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేయవద్దన్నారు. పదో తరగతి తర్వాత 40 శాతం మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారన్న గణాంకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యకు అవసరమైన అధ్యాపకులు, ప్రయోగశాలలు, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు.కర్పొరేట్ విద్యాసంస్థలకు ప్రయోజనం కలిగించే విధానాలను ప్రభుత్వం ప్రోత్సహించకూడదని పేర్కొన్నారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ ఉచిత విద్య అమలు చేయాలని, విద్యార్థుల ఫీజుల భారాన్ని ప్రభుత్వమే భరించేలా ప్రత్యేక నిధులు కేటాయించాలని సాజన్ కోరారు.