BREAKING
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ప్రోత్సహించడం అభినందనీయం. సార్సాలలో విఓ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్సీ. పల్లెలకు పాకిన గంజాయి మత్తు!? ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నేటి బాలలే రేపటి దేశానికి మార్గదర్శకులు సర్పంచ్ పోలు సంపత్ చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై సమీక్షా సమావేశం తాగునీటి సరఫరా నివారణకు వెంటనే ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి 5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి లను అందించిన ఎమ్మెల్యే గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి-టీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక నవంబర్ 26న మున్సిపల్ ఎన్నికలు.. 87 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు 188 వార్డులకు 443 పోలింగ్ స్టేషన్లు.. భద్రతపై ప్రత్యేక దృష్టి ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు జగద్గురువుల దర్శనానికి సర్వం సిద్ధం - ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు

బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి

Select Suryaa Now
బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి

భోగాపురం, మేజర్ న్యూస్:భోగాపురం మండల కేంద్రంలోని శ్రీ సాయినారాయణ హైస్కూల్‌లో జాతీయ బాలల దినోత్సవ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ చిన్నారుల సందడి, ఆనందోత్సాహాలతో కళకళలాడింది. పాఠశాల డైరెక్టర్లు టి. సుధీర్, అరుణ మాట్లాడుతూ.. బాలలే దేశ భవిష్యత్తుకు పునాదులని, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, సృజనాత్మకతకు పదును పెట్టేలా విద్యాబోధన సాగాలని అన్నారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా ఎదిగేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నిరంతరం ప్రోత్సాహం అందించాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల పీఈటీ శివప్రసాద్ ఉపాధ్యాయసిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

రిపోర్టర్: శ్రీనివాస్ భోగాపురం.