మెగా జాబ్ మేళా మంత్రి దామోదర్ రాజనర్సింహ l ఆధ్వర్యంలో
నేడే
ఆందోల్ నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా
జేఎన్‌టీయూ కళాశాలలో నిర్వహణ
యువత సద్వినియోగం చేసుకోవాలి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గొల్ల అంజయ్య
రాయికోడ్, ; నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో ఆందోల్ నియోజకవర్గంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ నెల 15వ తేదీ ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు చౌటకూరు మండలం సుల్తాన్‌పూర్‌లోని జేఎన్‌టీయూ కళాశాలలో ఈ కార్యక్రమం జరగనుంది. అని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గోల్ల అంజయ్య తెలిపారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ
ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. పదో తరగతి నుంచి పైచదువులు చదివిన, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఈ ఉద్యోగాలకు అర్హులని నిర్వాహకులు తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,288 వేతనం అందించనున్నారు. హైదరాబాద్‌లోని కొంగర కలాన్ కేకే పార్క్‌లో ఉద్యోగాలు కల్పించడంతో పాటు రొటేషనల్ షిఫ్ట్ విధానంలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వారానికి ఒకరోజు సెలవుతో పాటు ఉచిత భోజనం, రవాణా సదుపాయం కల్పించనున్నారు.
తీసుకురావాల్సిన పత్రాలు: ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, బ్యాంక్ పాస్‌బుక్, విద్యార్హత సర్టిఫికెట్లను అభ్యర్థులు వెంట తీసుకురావాలని సూచించారు.అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మెగా జాబ్ మేళాకు హాజరై ఉద్యోగాలు పొందాలని నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాలకు రాధిక (9059618521), నవీన్ (9398946830), మూర్తి (7842461759) నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.