BREAKING
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు ప్రోత్సహించడం అభినందనీయం. సార్సాలలో విఓ భవనానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్సీ. పల్లెలకు పాకిన గంజాయి మత్తు!? ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు నేటి బాలలే రేపటి దేశానికి మార్గదర్శకులు సర్పంచ్ పోలు సంపత్ చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలపై సమీక్షా సమావేశం తాగునీటి సరఫరా నివారణకు వెంటనే ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలి 5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి లను అందించిన ఎమ్మెల్యే గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి-టీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక నవంబర్ 26న మున్సిపల్ ఎన్నికలు.. 87 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు 188 వార్డులకు 443 పోలింగ్ స్టేషన్లు.. భద్రతపై ప్రత్యేక దృష్టి ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు జగద్గురువుల దర్శనానికి సర్వం సిద్ధం - ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు

ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

Select Suryaa Now
ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
సూర్య మంచిర్యాల :ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ డిమాండ్ చేశారు.శనివారం మీడియా సమావేశంలో సాజన్ మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలంటే విద్యార్థులు,తల్లిదండ్రులు,అధ్యాపకులు, విద్యావేత్తలు,కళాశాలల యాజమాన్యాలతో విస్తృతంగా చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.ఇంటర్మీడియట్ విద్యను తొలగించి సీనియర్ సెకండరీ విధానాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను తమ పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు.ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే వేలాది జూనియర్ కళాశాలల భవిష్యత్తుతో పాటు లక్షలాది మంది విద్యార్థుల విద్యావకాశాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.పదో తరగతి తర్వాత 40 శాతం మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారన్న ప్రభుత్వ వాదనపై స్పష్టత ఇవ్వాలని సాజన్ కోరారు.పాలిటెక్నిక్,ఐటీఐ, డిప్లొమా వంటి వృత్తి విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థులను కూడా డ్రాప్‌అవుట్లుగా పరిగణిస్తున్నారా అని ప్రశ్నించారు.ప్రభుత్వం ఏ విద్యా సంవత్సరం గణాంకాలను,ఏ విధానాన్ని ఆధారంగా చేసుకొని ఈ లెక్కలు చెబుతోందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోనే పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి ఉందని,అలాంటప్పుడు ఇంటర్మీడియట్ విద్యను కూడా అదే శాఖలో విలీనం చేస్తే విద్యార్థులకు అవసరమైన వసతులు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు.ఎంపీసీ, బైపీసీ,సీఈసీ,ఎంఈసీ వంటి కోర్సులకు అవసరమైన అధ్యాపకులు,ప్రయోగశాలలు,ఇతర సౌకర్యాలను ఎలా సమకూరుస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు.కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రయోజనం కలిగే ప్రమాదం ఇంటర్మీడియట్ విద్యలో మార్పుల వల్ల కార్పొరేట్ విద్యాసంస్థల ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని సాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.నారాయణ,శ్రీచైతన్య వంటి సంస్థలు పాఠశాల విద్యలోనూ విస్తరించే ప్రమాదం ఉందన్నారు.ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయకుండా వ్యవస్థాగత మార్పులు చేపడితే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకే ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.ఐఐటీ, జేఈఈ,నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవసరమైన ప్రత్యేక బోధనను ఎలా కొనసాగిస్తారో ప్రభుత్వం వివరించాలని కోరారు.ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఉచిత విద్య అమలు చేయాలిడిమాండ్ చేశారు.విద్యార్థుల ఫీజుల భారాన్ని ప్రభుత్వమే భరించేలా ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు.