telangana
ఐక్యతే బలం.. సేవే లక్ష్యం కావాలి - నిరుపేదలకు అండగా నిలవాలి - రాజకీయ రంగంలోనూ రాణించాలి – నలమాస్ కాంతయ్య
సూర్య, లక్షెట్టిపేట : ఆర్యవైశ్యులు కేవలం వ్యాపార రంగానికే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ముఖ్య సలహాదారు నలమాస్ కాంతయ్య పిలుపునిచ్చారు. నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా నిలుస్తూ, రాజకీయ రంగంలోనూ రాణించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సంఘంలో పదవులు చేపట్టడం అంటే బాధ్యతలను స్వీకరించడమేనని, ఆ బాధ్యతలను సమాజ అభ్యున్నతికి వినియోగించాలని పేర్కొన్నారు.శనివారం లక్షెట్టిపేట మండల ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శి ముక్త శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, సమాజంలోని నిరుపేదలను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు.
అనంతరం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చిలువేరు వైకుంఠం నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షుడిగా గౌరిశెట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కటకం అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కుంజర్ల శ్రీనివాస్, కోశాధికారిగా బొద్దుకూరి నరేష్ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను సంఘ నాయకులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ముఖ్య అతిథులకు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వొజ్జల రాజమౌళి, గుండ ప్రభాకర్, లక్షెట్టిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చెట్ల రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ వొజ్జల శ్రీనివాస్, ఐక్య వ్యాపార సంఘం అధ్యక్షుడు మైలారపు సుధాకర్, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు గడ్డం వికాస్, అవోపా జిల్లా ప్రధాన కార్యదర్శి కుంజర్ల శ్రీనివాస్, పట్టణ మహిళా సంఘం అధ్యక్షురాలు నరేందుల సాహితి, ప్రధాన కార్యదర్శి హారతి, కోశాధికారి కాసం స్వప్న, చింతల రంజిత్, బొద్దుకూరి రాజ్‌కుమార్, ఏలుగూరి వేణు తదితరులు పాల్గొన్నారు.