ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలిః బీసీ నేత, ఎంపీ ఆర్ కృష్ణయ్య
సూర్య, తెలంగాణ బ్యూరో ప్రతినిదిః సర్కార్ బడుళ్లో ఉపాధ్యాలు లేక ప్రభుత్వ పాఠశాలలు వెల వెలబోతున్నాయని, దీంతో విద్యార్థలు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ యాజమాన్యం క్రింది వచ్చే ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా యున్న 35వేల టీచర్ పోస్టులను భర్తీ చేసి చర్యలు తీసుకోవాలని, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 14 బి.సి సంఘాలు, నిరుద్యోగ సంఘాల సమావేశానికి నిరుద్యోగ జేఏసీచైర్మన్ నీల వెంకటేష్, జక్కుల చిన్న జంగయ్య యాదవ్, అధ్యక్షత వహించారు ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడారు. గత సంవత్సరం టీచర్ పోస్టులను భర్తీ చేశారు. వివిధ కారణాలతో మొత్తం టీచర్ పోస్టులు భర్తీ కాలేదు. ఇంకా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నవి. అ తర్వాత వేలాదిమంది రిటైర్ అయ్యారు. ఇంకొక వైపు లక్షలాదిమంది నిరుద్యోగుల ఉద్యోగాలు లేక రోడ్ల వెంట తిరుగుతూ, శక్తి – యుక్తులు వృధా చేసుకుంటున్నారు. టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో 12 వేల పాఠశాలలో ఇంగ్లీష్, మథ్స్, సైన్స్ పాఠాలు చెప్పేవారు లేరు. విద్యార్థులుకు ఈ సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం లేక చదువులల్లో వెనుకబడి పోతున్నారు. దీనిలో బేసిక్ విషయ పరిజ్ఞానం లేక జాతీయ పరీక్షలలో పోటీలో నీట్, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర పోటీపరీక్షలలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేకపోతున్నారు.
వాస్తవంగా ఎన్ని ఖాళీలు యున్నవి లెక్కించాలని, గత 10 సంవత్సరాల కాలంలో ఎంత మంది రిటైర్ అయ్యారు? ఎంత మంది ప్రమోషన్లు పొందారు. ఇతర కారణాలతో ఎన్ని ఖాళీలు ఏర్పడ్డాయి. లెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల జరిపిన టీచర్ పోస్టుల నియమకాలలో ప్రభుత్వ పాఠశాలలో ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలో నాన్ జాయినింగ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఉండడంతో భారీగా ఖాళీలు మిగిలిపోయాయి. ఇక ఎయిడెడ్ పాఠశాలలో గత 20 సంవత్సరాలుగా నోటిఫికేషన్ జారీ కాలేదు. అధర్శ – కస్తూర్బా పాఠశాలలకు పార్టీ టైమ్ టీచర్లతో నెట్టు కొస్తున్నారు. అలాగే రిటైర్ మెంట్ అయిన వాళ్ళ ఖాళీలతో కలిపి దాదాపు 35వేల టీచర్ పోస్టులు ఖాళీగా యున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో14, వేలు, ఎయిడెడ్ పాఠశాలలు 5900, ఎస్సీ/ఎస్టీ/బీసీ/మైనారిటీ గురుకుల పాఠశాలలు 9000, ఆదర్శ పాఠశాలలు 4500, కస్తూర్బా పాఠశాలలు 2 వేల ఖాళీలు ఉన్నట్లు తెలిసింది. ఇలా అన్నింటిలో కలిపి దాదాపు 35 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నవి. గెస్ట్ టీచర్స్/పార్ట్ టైం టీచర్స్ ను నియమించి పాఠాలు చెబుతున్నారు. ఇంకొక వైపు బీఈడి, డిఈడి చేసి, అన్నీ అర్హతలు గల 8 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం లేక తమ శక్తి – యుక్తులు వృదా అవుతున్నాయి. వీరి శక్తి – యుక్తులు సమాజాభివృద్ధికి ఉపయోగించవలసిన అవసరం ఉంది. టిచర్ పోస్టుల భర్తీని నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తున్నామనే బడ్జెటు ఖర్చు అవుతుంధని కోణంలో చూడరాదు. ఈ టిచర్ల ద్వారా భావి భారత పౌరులైన భాలలను తీర్చిదిద్ది ఈ సమాజానికి ఉపయోగపడే గొప్ప వారికి తయారు చేస్తామన్నామనే కోణంలో చూడాలి. పూర్తీ స్థాయి టిచర్ పోస్టులు భర్తీ చేస్తే ప్రభుత్వ పాటశాల వ్యవస్థను బలోపేతం చేస్తే విద్యాప్రమాణాలు పెరిగి విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప నైపుణ్యం గల మానవ వనరులుగా సమాజాభివ్రుద్దికి తోడ్పడుతారు. విద్యార్థులను తీర్చి దిద్దితే, వారిలో ఉన్న సృజనాత్మక శక్తి, తెలివి తేటలకు సాన పెడితే గొప్ప ఇంజినీర్లు, డాక్టర్లుగా, శాస్త్రవేత్తలుగా, సంఘ సంస్కర్తలుగా విలువ గల రాజకీయ నాయకులుగా తయరవుతారు. అప్పుడు దేశo శీఘ్ర గతిన అభివృద్ధి చెందుతుంది. అలాగే టీచర్ పోస్టుల ఈ విషయంలో ప్రభుత్వ పాఠశాలల పోస్టులు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/మైనారిటీ గురుకుల పాఠశాల పోస్టులు, ఆదర్శ పాఠశాల పోస్టులు కస్తూర్బా పాఠశాలలు ఎయిడెడ్ పాఠశాలల టీచర్ పోస్టులు కూడా వేరువేరుగా జరపడంతో మెరిట్ అభ్యర్థులు ఈ మూడు నాలుగు రకాల యాజమాన్యాల పాఠశాలలో మెరిట్ ఉన్న ఒకే అభ్యర్థికి నాలుగు పోస్టులలో సెలెక్ట్ అవుతారు. చివరకు ఒకే యాజమాన్యం పాఠశాల లో జాయిన్ అవుతారు. సెలెక్ట్ అయిన మిగతా మూడు వృధా అవుతాయి. అందుకే ఆప్షన్ పద్ధతి పెట్టడం, వెయిటింగ్ లిస్ట్ పెట్టడం, అన్ని ఫలితాలు ఒకేసారి ప్రకటించడం లాంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సుచిస్తున్నాము. అంతేగాక వీలుంటే రూల్స్ ని మార్చాలని అన్నింటికీ కలిపి ఒకే నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దీనివలన పోస్టులు మిగిలిపోవు. కావున వెంటనే టీచర్ పోస్టులను భర్తీకై నోటిఫికేషన్ జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ప్రక్రియ ప్రారంభిస్తే జూన్ విద్యా సంవత్సరంలో ప్రారంభం నాటికి పూర్తి స్థాయిలలో పాఠశాలల నిర్వహణ జరుగుతుంది. ఈ సమావేశంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, బి.సి. కులాల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అనంతయ్య, బి.సి విద్యార్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పగిళ్ళ సతీష్, బి.సి విద్యార్ధి సంఘం రాష్ట్ర కన్వీనర్ పర్లగోర్ల మోడీరాందేవ్ యాదవ్, బి.సి ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లం యాదయ్య, బి.సి ప్రజాసమితి రాష్ట్ర అధ్యక్షులు భీమరాజు మరియు ముఖ్య బి.సి నాయకులూ రాజేందర్, శివ కుమార్ యాదవ్, నరేష్ గౌడ్, శ్రీశైలం, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎ.రవీందర్, హైదరాబాద్.