telangana
తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం నూతన మండల కమిటీ ఎన్నిక
సూర్య జైనూర్: జైనూర్ మండల కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో మండల అధ్యక్షుడిగా కుమ్ర జుగది రావు, ఉపాధ్యక్షులుగా ఆత్రం భీమ్రావు, కినక తులసీరామ్, ప్రధాన కార్యదర్శిగా మడావి గణపతి, సహాయ కార్యదర్శిగా పంద్రా హనుమంతరావును ఎన్నుకున్నారు.అలాగే కమిటీ సభ్యులుగా పెందోర్ తెలంగాణరావు, కినక నగేష్, సోయం రవీందర్, ఉయిక కృష్ణమూర్తి, కుమ్ర లక్ష్మణ్, వెడ్మ ఇష్రు, సీడం రాజేశ్వర్, సోయం చందన్ షాను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ఈ ఎన్నికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యుడు కార్తీక్ నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, చట్టాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆదివాసీలకు సంబంధించిన చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.