BREAKING
భారత్-ఇటలీ మధ్య శాస్త్రీయ పరిశోధకుల సహకారానికి ప్రత్యేక నిధి ఏర్పాటు ఛత్ మహాపర్వ్ సంధ్యా అర్ఘ్యం వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు పురపాలక ఎన్నికలకు నేటి వరకు 69 నామినేషన్లు వచ్చాయి మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు పట్టా భూములపై పెత్తనం.. ప్రశ్నిస్తే దౌర్జన్యమా?అర్ధరాత్రి వేళ కంచె తొలగించి ఆక్రమణకు యత్నం!ప్రాణభయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదు స్వీకరించలేదని బాధితుల ఆరోపణజిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వేడుకోలు బిఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్సవం - భారీగా పార్టీలో చేరుతున్న నాయకులు - సుడిగాలి పర్యటనలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే విశ్వశాంతి పాఠశాలలో బాలల దినోత్సవం ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఆర్.నడింపల్లి పంచాయతీ సర్పంచ్ బరిలో సిహెచ్ సరసమ్మ : వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ : గ్రామ అభివృద్ధి,ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయమని వెల్లడి *కొండకేగిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి* - *గోవింద నామస్మరణతో మారుమోగిన భీమ్‌గల్ పురవీధులు* - *భక్తజన సందోహం మధ్య వైభవంగా ఉత్సవ విగ్రహాల ఊరేగింపు* - *వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. బోనాలు, మంగళహారతులతో ఆధ్యాత్మిక శోభ* బెంగళూరు వేదికగా కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు స్వర్ణోత్సవాల సంబరాల్లో ఐఏఎఫ్ 3 బేస్ రిపేర్ డిపాట్ ఉపగ్రహ సాంకేతికతపై మిట్స్ విద్యార్థుల పారిశ్రామిక పర్యటన : బెంగళూరులోని ఇస్రో యు.ఆర్.ఎస్.సి సెంటర్ విజిట్ రాష్ట్రస్థాయి పోటీలకు టీ ఎం రావ్ హెచ్ ఎస్ విద్యార్థులు దేశంలో పేదరిక నిర్మూలన, నక్సలిజం అణచివేతే ప్రభుత్వ ప్రధాన విజయాలన్న ప్రధాని మోదీ సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి భక్తుల విరాళాలు

వార ఫలాలు | ద్వాదశరాశి ఫలములు | Weekly Horoscope | 15 Nov 2026 - 21 Nov 2026 వరకు by Dr Edupuganti Padmaja Rani

Select Suryaa Now
వార ఫలాలు | ద్వాదశరాశి ఫలములు | Weekly Horoscope | 15 Nov 2026 - 21 Nov 2026 వరకు by Dr Edupuganti Padmaja Rani

వార ఫలాలు | ద్వాదశరాశి ఫలములు | Weekly Horoscope | 15 Nov 2026 - 21 Nov 2026 వరకు by Dr Edupuganti Padmaja Rani

మేషరాశి...

ప్రారంభంలో వృత్తిలో అధికబాధ్యతలు శ్రమ ఒత్తిడి. పట్టుదలతో పనులు పూర్తి చేసే ప్రయత్నాల వల్ల నిద్ర, ఆరోగ్య శ్రద్ధ అవసరం. రుణ అంశాలలో వ్యాపార, భాగస్వామ్య నిర్ణయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వారం మధ్యలో ఆకస్మిక లాభాలలో, సృజనాత్మకతతో ముందుకు వెళ్లే ప్రయత్నాలలో ఆలోచనల వేగాన్ని గమనించుకుంటూ అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. విద్యార్థులు షార్ట్ కట్లు కాకుండా, శ్రమ ఏకాగ్రతతో, అభివృద్ధి కృషి చేయాలి. విందు వినోదాలు, నూతన వ్యక్తుల కలయిక. వారాంతం వృత్తి, స్థిరాస్తి, విద్యా వృద్ధికై అధిక శ్రమ అలసట, నిద్రలేమి. సమయానికి ఆహార స్వీకరణ ముఖ్యం. కుటుంబ సభ్యుల ఆరోగ్యము, కమ్యూనికేషన్లో శ్రద్ధ. ఒత్తిడి అధిగమించాలి. అమ్మవారి ఆరాధన మేలు.

వృషభరాశి… 

వారం ప్రారంభంలో దూర ప్రయాణాలు, ఉన్నత విద్య, ఆధ్యాత్మిక ఆలోచనలు, పెద్దల సహకారం ఆశాజనకం. తండ్రి ఆరోగ్యం, ఆశించిన ఆర్థిక అంశాల అనుకూలతలు. మధ్యలో వృత్తి బాధ్యతలు నూతన అవకాశాలు విదేశీ సంబంధ వ్యక్తులతో చర్చలు, నెట్వర్క్ లభిస్తుంది. దూర ప్రాంతాలలో నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు. మార్కెటింగ్ వారికి ప్రోత్సాహం. వాహనాల డ్రైవింగ్లో శ్రద్ధ అవసరం. వారాంతం సమావేశాలు, చర్చలు, సంతాన వృద్ధి, పెట్టుబడులకి ఆలోచనలు. మానసిక ప్రశాంతత, చిన్ననాటి మిత్రుల సహకారం. ఆశించిన సమాచారం ఆనందాన్నిస్తుంది. గృహ, వాహన, మాతృ అంశాలు, నిర్ణయాలు ఒక కొలిక్కి వస్తాయి. శరవణ గణపతి దత్త ఆరాధన మేలు.

మిధున రాశి… 

వారం ప్రారంభంలో ముఖ్య విషయాలలో ఆలస్యాలు, వృత్తిపరంగా అధికశ్రమ, ఘర్షణలు లేకుండా వృత్తిలో సమయానికి పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి . ఆరోగ్య, ఆర్థిక విషయంలో శ్రద్ధ అవసరం. మధ్యలో ఆధ్యాత్మిక ఆలోచనలు దూర ప్రయాణాలు ఉన్నత విద్య విషయాలలో సహకారం కోరుకుంటారు. సజ్జన మైత్రిని సద్వినియోగ పరుచుకోవాలి. వృత్తి వ్యాపార అంశాలలో నిర్ణయ సామర్థ్యం, పరాక్రమం, ఆత్మీయ సహకారం పెరుగుతుంది. వారాంతం అధిక శ్రమతో వృత్తిలో గౌరవాన్ని సాధిస్తారు. గృహ, వాహన విషయాలలో, ఖర్చులలో జాగ్రత్త అవసరం. భాగస్వామి సహకారాన్ని, సలహాలని స్వీకరించాలి. అమ్మవారి అష్టోత్తరం, దేవాలయ సందర్శన మేలు.

కర్కాటక రాశి...

ప్రారంభంలో మైత్రి బంధాల కొరకు, విదేశీ వ్యక్తులతో వ్యాపార వ్యవహారాలు, భాగస్వామితో ఆధ్యాత్మిక, దూర ప్రయాణాలు ఆలోచనలు. గుర్తింపు గౌరవం పలుకుబడి. వారం మధ్యలో అనవసర ఆందోళనలు అధిగమించాలి. ముఖ్య వ్యవహారాలలో చికాకుపెట్టే ఆలోచనలు, వ్యక్తులని గమనించుకుంటూ ముందుకు వెళ్లాలి. ఆకస్మిక లాభాలు, ఘర్షణాత్మక వాక్కు వల్ల కుటుంబ బంధాల్లో, ఆర్థిక వ్యవహారాలలో ప్రశాంతత తక్కువ. వారాంతం ఆధ్యాత్మిక విద్య, ప్రయాణాలు, దేవాలయ సందర్శనలు, ఆర్థిక విషయాలు అనుకూలత. మాట విలువ బాగుంటుంది. వ్యక్తుల సహకారం సామాన్యం. తోబుట్టువుల చర్చలు, కలయిక అవకాశాలు. స్థిరాస్తి శ్రద్ధ అవసరం. సుబ్రహ్మణ్య అష్టోత్తరాలు మేలు.

సింహరాశి… 

వారం ప్రారంభంలో వృత్తిపరమైన విషయాలలో అధిక శ్రమ, ఆరోగ్య శ్రద్ధ ముఖ్యం, ప్రత్యర్థుల మీద పోటీలు, న్యాయ విషయాలలో ఆలోచనలు. అనుకోని ఖర్చులు అధికం. శ్రమతో పనులు పూర్తి చేసే ప్రయత్నాలలో చిన్నపాటి ఆలస్యాలు ఆటంకాలు. వ్యాపార విస్తరణకు, భాగస్వామ్య వ్యవహారాలకు కొత్త ఆలోచనలు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయం మీద  శ్రద్ధ. దూర ప్రయాణాలకు సంతానవృద్ధి, స్నేహ సంబంధాలకు అవకాశాలు. ఉద్వేగమైన నిర్ణయాలకు, వేగవంతమైన ఆలోచనలకు తావివ్వరాదు. వారం చివరిలో ఆరోగ్య సంబంధమైన ఆకస్మిక లాభాలకొరకు పెట్టుబడులకై ఖర్చులు. వ్యాపార భాగస్వాములతో ఆకస్మిక మార్పులు. గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు.

కన్యా రాశి… 

వారం ప్రారంభంలో ఆత్మీయ వ్యక్తులతో నూతన కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మిక వృద్ధి. మిత్రులని సమయానికి సద్వినియోగ పరచుకుంటారు. నూతన పెట్టుబడులకు ఆలోచనలు, సంతాన వృద్ధి. వారం మధ్యలో తక్కువ శ్రమతో పనులు పూర్తి చేయడానికి అవకాశాలు. పోటీలలో అనుకూలం నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత వరకు ఆశాజనకం. క్రీడల పై ఆసక్తి. విదేశీ పెట్టుబడుల మీద దృష్టి. వారాంతం మైత్రి బంధాలు స్నేహ సంబంధాలు, వ్యాపార వ్యవహారాలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, ఆధ్యాత్మిక ప్రదేశాలు, దూర ప్రయాణాలకు అవకాశం. ఖర్చుల విషయంలో, ఆరోగ్య అంశాలలో జాగ్రత్తలు అవసరం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మేలు.

తులా రాశి… 

వారం ప్రారంభంలో విద్యా , స్థిరాస్తి విషయాలలో దృష్టి సారిస్తారు. ముఖ్యంగా రుణ  ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు పోటీలలో అధిక శ్రమ. నూతన విషయాలు నేర్చుకుంటారు. వారం మధ్యలో సంతాన అభివృద్ధి కొరకు, నూతన పెట్టుబడులకి, ప్రియమైన వ్యక్తులతో చర్చలలో ఎక్కువ శ్రద్ధ. మానసిక ప్రశాంతత పెంపొందించు కోవాలి. ఆశించిన విషయాలలోవృద్ధి నూతన వృత్తులకి అవకాశాలు. వారం చివరిలో పోటీలలో అనుకూలత, వృత్తిలా అభివృద్ధి, ఆధ్యాత్మిక ఆశీస్సులు, వృత్తిలో అనుభవజ్ఞుల సహకారం, కుటుంబ ఆర్థిక విషయాలలో వ్యాపార అభివృద్ధిలో అనుకూల మార్పులు. వ్యక్తిగత ఆహార, కంటి ఆరోగ్య శ్రద్ధ ముఖ్యం. దుర్గాదేవి ఆరాధన మేలు.

వృశ్చిక రాశి… 

ప్రారంభంలో సామర్థ్యంతో కృషితో పనులు సాధిస్తారు. ప్రయాణాలు, మిత్రులు, తోబుట్టువులుతో ప్రణాళికలు చర్చిస్తారు. సంతాన సహకార అంశాలు ఆలోచనలు. ఆర్థిక విషయాలు కొంత మెరుగు. వారం మధ్యలో స్థిరాస్తులు గృహ విషయాలు ప్రశాంతతను తగ్గిస్తాయి. డ్రైవింగ్, వాహనలపై శ్రద్ధ అవసరం. కుటుంబ విషయాలలో ఆలస్యాలు ఆటంకాలు. వృత్తిపరంగా శ్రమ బాధ్యతలు. ఆ రీత్యా ఉద్వేగాలని, వైరాగ్యాన్ని అధిగమించాలి. వారాంతం సంతానవర్గంతో వారి అభివృద్ధి రీత్యా సమన్వయ లోపం లేకుండా మంచి నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి కి వృద్ధి, వృత్తి వ్యాపారాలలో నూతన మార్పులు. దత్త ఆరాధన, దత్త చరిత్ర మేలు చేస్తాయి.

ధను రాశి… 

ప్రారంభంలో కుటుంబ, గృహపర ఆకస్మిక ఖర్చులు. ఆర్థిక వాగ్దానాలలో ఆలస్యాలు అధిగమించే ప్రయత్నం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు. వారం మధ్యలో లక్ష్యంతో సామర్థ్యంతో పనులు పూర్తి. తోబుట్టువుల సహకారం కొంతవరకు అనుకూలం. దగ్గరప్ర యాణాలు కొరకు ఖర్చులు.  పరాక్రమంగా నిర్ణయాలు తీసుకుంటారు. నూతనవిషయాలలో ఆసక్తి. ఆధ్యాత్మిక ఆలోచనలు. సజ్జన సహకారం అనుకూలం. వారం చివరిలో స్థిరాస్తి వ్యవహారాల సంబంధ ఖర్చులు. తండ్రి పెద్దల సలహాలు ఆలోచింపచేస్తాయి. ఉన్నత విద్యా, దూర ప్రయాణాలు. ఆధ్యాత్మిక వ్యక్తుల ఆశీస్సులు. వృత్తిలో శ్రమ, అసంతృప్తి అధిగమించాలి. అధికారులైన స్త్రీలతో సమావేశాలలో సమన్వయం ముఖ్యం. ఆదిత్య హృదయ పారాయణ మేలు.

మకర రాశి… 

ప్రారంభంలో భాగస్వామికి సహకారాన్ని అందిస్తారు. స్వశక్తితో ఆశించిన వాటిలో వృద్ధి. సాంఘిక సంబంధాలు, అనుకూలం. కొత్త నిర్ణయాలు. ఉల్లాసంగా ఉత్సాహంగా పనులు ప్రారంభిస్తారు. మిత్రులు, సిబ్బంది సహకరిస్తారు. మధ్యలో ఆర్థికంగా అనుకూలం, ఆత్మవిశ్వాసం అధికం. కుటుంబ సభ్యులతో, భాగస్వామి పెద్దలతో గృహసం బంధ కీలక నిర్ణయాలు పంచుకుంటారు. దూరప్రాంతంలో ఉన్న తోబుట్టువులతో  ప్రణాళిక చర్చిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య విషయంలో శ్రద్ధ ముఖ్యం. వారం చివరిలో మిత్ర, తోబుట్టులతో కమ్యూనికేషన్ అనుకూలం. అధిక ఖర్చులు ఇబ్బంది కలిగిస్తాయి. భూమి, గృహ, స్థిరాస్తి వ్యవహారాలలో ఆకస్మిక ఖర్చులలో, నిర్ణయాలలో, ఉద్వేగాలు అధిగమించాలి. ప్రశాంతత ముఖ్యం. సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన మేలు.

కుంభ రాశి… 

ప్రారంభంలో వృత్తిపరమైన శ్రమ నిద్రలేమి. మానసిక ప్రశాంతత తక్కువ. వ్యక్తిగత అభివృద్ధి, ఆర్థిక వ్యవహారాలలో, కుటుంబ విషయాలలో అధిక ఆలోచనలు. ఖర్చులు అధికం. వృత్తిపరమైన ప్రయాణాలు. మధ్యలో ఆత్మవిశ్వాసం అధికం, మాటలు వల్ల ఆత్మీయులతో ఘర్షణ. ఆలస్యం అవుతున్న వాగ్దానాలు నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపార విషయాలలో సమన్వయం ముఖ్యం. వారం చివరిలో రుణ విషయాలలో కీలక నిర్ణయాలు. ఆర్థిక విషయాలు కొంత అనుకూలం. వ్యాపార వ్యవహా రాలలో, తోబుట్టువులతో, జీవిత భాగస్వామితో చర్చలలో నిర్ణయాలలో నిదానం అనుకూలిస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సందర్శన మేలు.

మీన రాశి… 

ప్రారంభంలో ఆలోచనలు అనుకూలం, సంతాన వర్గం, ఆత్మీయుల సహకారం, ఆశించిన విషయాలు  ఆశాజనకం. ఆలస్యం అవుతున్న పనులు మిత్రుల నెట్వర్క్ సహకారంతో పూర్తి చేసుకుంటారు. సమావేశాలు చర్చల్లో పాల్గొంటారు. వారం మధ్యలో శ్రమ అధికం, దూర ప్రయాణాలు అనవసర ఖర్చులు అధిగమించాలి. వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ ముఖ్యం. రుణాల విషయంలో, పోటీల విషయంలో శ్రమ అధికం. బద్ధకాన్ని అధిగమించాలి. వారం చివరిలో మానసిక ఉల్లాసం, కొత్త ఆలోచనలు. నూతన వృత్తుల కొరకు ప్రయత్నించే వారికి కొత్త అవకాశాలు. నిత్య జీవితంలో రొటీన్ లో మార్పులు, శ్రమతో పనులు సాధిస్తారు. దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది.

గమనిక: ఇవి జనరల్ రాశి ఫలాలు. ఒక వ్యక్తికి ప్రత్యేకంగా కాదు. ఇవి చంద్రరాశి ఆధారిత గోచార ఫలాలు. వ్యక్తి జన్మసమయ, స్థల వివరాలతో ఏర్పడిన జన్మకుండలి లోని దశ-అంతర్దశలతో కలిపి చూస్తేనే సరియైన అవగాహన వస్తుంది. గోచార గ్రహఫలాలు తక్కువగా ఉన్నా దశలు శుభంగా ఉంటే ప్రభావం స్వల్పమే. చిన్న పరిహారాలతో శుభ ఫలితాలు పొందవచ్చు. 

 

డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani

జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant

email : padma.suryapaper@gmail.com

www.padmamukhi.com