BREAKING
గీతాంజలి లో ఘనంగా స్వయం పాలన, బాలల దినోత్సవ వేడుకలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న విజేత ఉపాధ్యాయులు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి-టీ ఆర్ ఎస్ అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక నవంబర్ 26న మున్సిపల్ ఎన్నికలు.. 87 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు 188 వార్డులకు 443 పోలింగ్ స్టేషన్లు.. భద్రతపై ప్రత్యేక దృష్టి ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు జగద్గురువుల దర్శనానికి సర్వం సిద్ధం - ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ బాబు మదర్ తెరిసా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు ఇంటర్ బోర్డు విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి బిజెపి ఆర్టిఐ జిల్లా కన్వీనర్ గా శ్రవణ్ కుమార్ నియామకం చీరాల వైసీపీకి షాక్.. టీడీపీలోకి యూత్ లీడర్ పేర్లి నాని నవంబర్ 18న దళిత జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర 11వ సభ... ప్రజల ఆరోగ్యంతో అధికారుల చెలగాటం! పట్టణంలో ఎక్కడ చూసినా అనధికారిక అల్పాహార కేంద్రాలే... నాణ్యత లేని ఆహార పదార్థాలతో ప్రజల ప్రాణాలకు ముప్పు! నిబంధనలు గాలికి.. అధికారుల పర్యవేక్షణ కరువు.. పట్టించుకునే నాథుడే లేడా? ఘనంగా బాలల దినోత్సవం ఐక్యతే బలం.. సేవే లక్ష్యం కావాలి - నిరుపేదలకు అండగా నిలవాలి - రాజకీయ రంగంలోనూ రాణించాలి – నలమాస్ కాంతయ్య

భారతదేశ ఆధునిక నిర్మాణానికి పునాదులు వేసిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ - ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

Select Suryaa Now
భారతదేశ ఆధునిక నిర్మాణానికి పునాదులు వేసిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ - ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో భారతరత్న, భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వర్గీయ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి , టీపీసీసీ జనరల్ సెక్రటరీ గండ్రత్ సుజాత  మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి  కలిసి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్‌లోని విజయ డైరీ పక్కన ఉన్న విజ్ఞాన్ స్పెషల్ స్కూల్‌ను సందర్శించి, అక్కడి చిన్నారులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బిస్కెట్లు, పెన్సిళ్లు, పెన్నులు పంపిణీ చేసి, వారితో కొంత సమయం ఆనందంగా గడిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధికి శ్రీకారం చుట్టి, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, విద్య, వైద్యం మరియు సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, లౌకికవాదం, సామాజిక సమానత్వానికి నెహ్రూ  అందించిన సేవలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా నేతలు వారి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.