BREAKING
టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా జాయింట్ సెక్రటరీగా మేడ మురళీధర్ ఎన్నిక విద్యార్థులే దేశ భవిష్యత్తు వారి సంతోషమే సమాజానికి స్ఫూర్తి కరస్పాండెంట్ కుర్ర అవర్ణ భారతదేశ ఆధునిక నిర్మాణానికి పునాదులు వేసిన మహానేత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ - ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ఘనంగా గురుశ్రేష్ఠ అవార్డుల ప్రధాన కార్యక్రమం ఎవరూ దోచుకోలేని జ్ఞానసంపద బిజెపి నాయకుల ముందస్తు అరెస్టులు విజ్ఞాన వికాసానికి చక్కని వేదికలు గ్రంధాలయాలు : అన్నమయ్య జిల్లా డీఈఓ సుబ్రహ్మణ్యం వెల్లడి : ఘనంగా ప్రారంభమైన 59వ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలిః బీసీ నేత, ఎంపీ ఆర్‌ కృష్ణయ్య బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి మున్నేరు- పాలేరు లింకు కెనాల్ రద్దు చేయాలని కోరుతూ ధర్నా మధుమేహంపై అవగాహనతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష పూర్తయ్యేంత వరకు ప్రతి క్షణం అత్యంత విలువైనది - ఎస్పీ అఖిల్ మహాజన్ మాజీ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు

మధుమేహంపై అవగాహనతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు

Select Suryaa Now
మధుమేహంపై అవగాహనతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు

 

• 30 ఏళ్లు పైబడిన వారందరూ మధుమేహ పరీక్షలు చేయించుకోవాలి – జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్

మంచిర్యాల, సూర్య ప్రతినిధి :

ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మధుమేహంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, సబ్ యూనిట్ అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధుమేహంపై అవగాహన కలిగి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చని తెలిపారు. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మధుమేహంతో పాటు ఇతర అసంక్రమిత వ్యాధుల ముప్పును తగ్గించుకోవచ్చని సూచించారు. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటాన్ని మధుమేహం అంటారని, అలసట, తరచుగా దాహం వేయడం, అధికంగా మూత్ర విసర్జన, ఎక్కువ ఆకలి, బరువు తగ్గడం, కంటి చూపు మసకబారడం, గాయాలు నెమ్మదిగా మానడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరించారు. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడినవారు, అధిక బరువు ఉన్నవారు, కుటుంబంలో మధుమేహ చరిత్ర ఉన్నవారు, గర్భిణీలు వైద్యుల సూచన మేరకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా 30 ఏళ్లు పైబడిన వారందరికీ మధుమేహం తదితర వ్యాధుల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మధుమేహం పట్ల భయపడాల్సిన అవసరం లేదని, సరైన సమయంలో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే నియంత్రణలో ఉంచుకోవచ్చని పేర్కొన్నారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక, వ్యాయామం చేయాలని, సమతుల ఆహారం తీసుకోవాలని, మిఠాయిలు, అధిక చక్కెర పదార్థాలు, అధిక పిండి పదార్థాల విషయంలో నియంత్రణ పాటించాలని సూచించారు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటంతో పాటు తగినంత నిద్ర, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని తెలిపారు.

మధుమేహాన్ని గుర్తించేందుకు ఉపవాస రక్తంలో చక్కెర పరీక్షతో పాటు భోజనం చేసిన రెండు గంటల తర్వాత పరీక్ష చేయించుకోవాలని వివరించారు. జిల్లాలోని అన్ని ఆరోగ్య ఉపకేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రీ-డయాబెటిస్ దశలోనే జీవనశైలిలో మార్పులు చేసుకొని మంచి అలవాట్లు అలవరచుకుంటే మధుమేహం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలందరూ మధుమేహంపై అవగాహన పెంచుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామాలను సందర్శించినప్పుడు ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ అధికారి విజయలక్ష్మి, ఇతర నర్సింగ్ అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది, రోగులు, ప్రజలు పాల్గొన్నారు.