సహకార పరపతి సంఘం సభ్యులు ఈకేవైసీని చేసుకోండి
సహకార పరపతి సంఘం సభ్యులు ఈకేవైసీని చేసుకోండి
హొళగుంద సూర్య ప్రతినిధి:
హొళగుంద సహకార పరపతి సంఘం సభ్యులు వెంటనే ఈకేవైసీని చేసుకోవాలని హొళగుంద వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు పి.విష్ణువర్ధన్ రెడ్డి పత్రిక ముఖంగా తెలియజేయశారు.
ప్రభుత్వం త్వరలోనే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నదని చెప్పారు.
సంఘములో సభ్యత్వం ఉన్నా ప్రతి ఒక్క సభ్యులు తప్పక ఈకేవైసిని చేసుకోవాలని తెలిపారు. ఆధార్,పొలం పాస్ బుక్, ఆధార్ లింక్ అయిన పోన్ నెంబర్ తో సంఘం కార్యాలయము నకు వెళ్లి ఈకేవైసీని చేయించుకోవాలన్నారు. అదేవిధముగా సంఘము నందు ఋణము పొందిన సకాలములో వడ్డీ లేదా కంతు కట్టనివారికి ఓటు హక్కు మరియు పోటీచేయు హక్కు ఉండదని తెలిపారు.కావున వెంటనే వడ్డీ లేదా కంతు కట్టి ఓటు హక్కు పొందగలరని తెలియజేశారు.
టి.ఉమాపతి, సూర్య ప్రతినిధి కర్నూలు జిల్లా