telangana
కౌటాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
సూర్య, కౌటాల : బాలల దినోత్సవం సందర్భంగా.శనివారం కౌటాలలోని ప్రాథమిక పాఠశాలలో వేడుకలు ఘనంగా జరిగాయి.చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు స్వీట్లు, బహుమతులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఉప సర్పంచ్ డబ్బా గోపాల్ మాట్లాడుతూ... పిల్లలే దేశ భవిష్యత్తు, వారిని చదువులో ముందుంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమమిటి చైర్మన్ సిద్దల దేవయ్య, వార్డ్ సబ్యులు,గ్రామ పంచాయతీ కార్యదర్షి కైలాసం ,ఉపాధ్యాయులు,అన్గన్ వాడి టీచర్లు,ఆశ వర్కర్లు, తల్లితండ్రులు, గ్రామపెద్దలు, విద్యార్తులు పాల్గొన్నారు