గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు_ సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య
లింగాల :
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విజ్ఞాన
సముపార్జన కోసం గ్రంథాలయాలను విద్యార్థులు, యువతి యువకులు సద్వినియోగం
చేసుకోవాలని సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య అన్నారు. లింగాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల గ్రంథాలయాన్ని సర్పంచ్ ప్రారంభించారు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య మాట్లాడుతూ
గ్రంథాలయాలు విద్యార్థుల
ఉజ్వల భవిష్యత్తుకు పునాది
అని అన్నారు.పుస్తక పఠనంతోనే ఉజ్వల భవిష్యత్తు, శాశ్వత జ్ఞానం ఉంటుందని పేర్కొన్నారు. లైబ్రరీలో గ్రంథాలు చదువుకుని
ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతీయువకులను ప్రేరణగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థిని విద్యార్థులుగా మీరు నిత్యం గ్రంథాలయానికి వెళ్తూ విజ్ఞానం పెంచుకోవాలని, ఒక
గ్రంథాలయం దగ్గరికి వస్తే నమ్మకమైన మేధోభరితమైన
సమాచారం పుస్తకాల్లోనూ పత్రికల్లోనూ లభ్యం
అవుతుందని, విజ్ఞానం పెంచుకొని దేశాభివృద్ధికి
తోడ్పడాలని ఆయన అన్నారు. విద్యార్థులు,యువతరం సెల్ ఫోన్ల మాయలో పడి జీవితాలను చిన్నాభిన్నం
చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండి చక్కని క్రమశిక్షణతో పుస్తక పఠనం అలవర్చుకోవాలని సూచించారు. ఎంతోమంది
గ్రంథాలయాలలో పుస్తకాలు చదివి ప్రపంచం మేధావులుగా గుర్తింపు పొందాలని వారి అడుగుజాడలు నడవాలని సూచించారు. విజ్ఞానం ఏ ఒక్కరి
సొత్తు కాదు అది చదువుకున్న వారికి మాత్రమే
సొంతమని హైస్కూల్ స్థాయి గ్రంథాలయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పాఠశాల గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య,ఇంచార్జి హెచ్ఎం కొండయ్య, గ్రామ వార్డ్ నెంబర్లు కాట్రావత్ రాజు, నేనావత్ వెంకట్, గుత్తి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.