BREAKING
ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలిః బీసీ నేత, ఎంపీ ఆర్‌ కృష్ణయ్య బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి మున్నేరు- పాలేరు లింకు కెనాల్ రద్దు చేయాలని కోరుతూ ధర్నా మధుమేహంపై అవగాహనతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష పూర్తయ్యేంత వరకు ప్రతి క్షణం అత్యంత విలువైనది - ఎస్పీ అఖిల్ మహాజన్ మాజీ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి - ఎమ్మెల్యే పాయల్ శంకర్ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు_ సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య బస్ స్టాప్ వద్దే నామినేషన్ పారాలు అందజేస్తున్న సచివాలయ సిబ్బంది. కౌటాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు రంగాపురం గ్రామపంచాయతీలో ఘనంగా బాలల దినోత్సవ గ్రామసభ మాలధారుల భిక్ష కార్యక్రమానికి దాతల సహకారం 18వ సంవత్సరం కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమo పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి

గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి - ఎమ్మెల్యే పాయల్ శంకర్

Select Suryaa Now
గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి - ఎమ్మెల్యే పాయల్ శంకర్
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : ఆదిలాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, బాలల దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ మల్లెపూల నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్ ఎస్ చిత్రు, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, ఏఐ, డిజిటల్ మాధ్యమాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ పుస్తక పఠనం ద్వారా లభించే విజ్ఞానం, ఏకాగ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం గ్రంథాలయంలో మరిన్ని ఏసీలు ఏర్పాటు చేస్తామని, ఇతర మండలాల నుంచి వచ్చే పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించేలా కృషి చేస్తామని తెలిపారు. జీపీఓ, డీఎస్సీ పోస్టుల భర్తీ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు.అదనపు కలెక్టర్ చిత్రు మాట్లాడుతూ, గ్రంథాలయంలో కల్పించిన ఆధునిక సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష మాట్లాడుతూ, పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం, ఏకాగ్రత పెరుగుతాయని, విద్యార్థులు గ్రంథాలయాలను వినియోగించుకోవాలని కోరారు.చైర్మన్ డాక్టర్ మల్లెపూల నర్సయ్య మాట్లాడుతూ, జిల్లాలోని గ్రంథాలయాలను ఆధునిక విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని, 12 మండల గ్రంథాలయాల పునరుద్ధరణతో పాటు ఏసీలు, కూలర్లు, ఫర్నిచర్ ఏర్పాటు చేశామని తెలిపారు.జిల్లాలో ఒక కేంద్ర గ్రంథాలయం, 12 శాఖా గ్రంథాలయాలు, 13 పౌర పఠన మందిరాల ద్వారా సేవలు అందిస్తున్నామని, 1,36,680 పుస్తకాలు, 16,581 మంది సభ్యులు ఉన్నారని కార్యదర్శి వివరించారు.నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించే వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శన, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, కవి సమ్మేళనం, రంగోలి పోటీలు నిర్వహించనున్నారు. నవంబర్ 20న ముగింపు వేడుకల్లో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు ప్రకాష్, శ్రీకాంత్, భండారి పోచన్న, జోగు రవి, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు, పాఠకులు, పాల్గొన్నారు.