రంగాపురం గ్రామపంచాయతీలో ఘనంగా బాలల దినోత్సవ గ్రామసభ
నల్లబెల్లి, మేజర్ న్యూస్, నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక బాలల దినోత్సవ గ్రామసభ నిర్వహించారు.కార్యక్రమానికి సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బాలల దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ, పిల్లల విద్య, ఆరోగ్యం, పోషకాహారం, బాలల హక్కులు మరియు వారి భవిష్యత్తు అభివృద్ధిపై అవగాహన కల్పించడం జరిగింది. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మేడిపల్లి రామారావు, జెడ్పీఎస్ఎస్ హెచ్ఎం, యాకూబ్ రెడ్డి ఎంపీపీఎస్ ఉపాధ్యాయులు రాజిరెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. బాలలే దేశ భవిష్యత్తు – ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం, మంచి భవిష్యత్తు కల్పించడం మనందరి బాధ్యత అని అన్నారు
రిపోర్టర్; శంకరయ్య, నల్లబెల్లి, వరంగల్ జిల్లా