గ్రంథాలయ వారోత్సవాలు సద్వినియోగం చేసుకోవాలి-ఎస్ఐ టి సూర్య శ్రీనివాస్
ముదినేపల్లి , మేజర్ న్యూస్ : ముదినేపల్లి గ్రేడ్ 3 శాఖ గ్రంధాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఎస్ఐ టి సూర్య శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఈ వారోత్సవాలను విద్యార్థులు , పుస్తక పఠన ప్రియులు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతిరోజు జరిగే కార్యక్రమాలలో విద్యార్థులతో పాటు మహిళలు , గ్రామస్తులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయాధికారిణి ఎం శ్రీదేవి , ఉపాధ్యాయులు కొత్తూరు వెంకట సుబ్బారావు (సుబ్బయ్య) , జి శివదుర్గ , పి ఉషా కిరణ్ , బిసి బాలుర హాస్టల్ వార్డెన్ సురేష్ , నవీన్ కుమార్ , అక్కిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.