BREAKING
ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష పూర్తయ్యేంత వరకు ప్రతి క్షణం అత్యంత విలువైనది - ఎస్పీ అఖిల్ మహాజన్ మాజీ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి - ఎమ్మెల్యే పాయల్ శంకర్ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు_ సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య బస్ స్టాప్ వద్దే నామినేషన్ పారాలు అందజేస్తున్న సచివాలయ సిబ్బంది. కౌటాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు రంగాపురం గ్రామపంచాయతీలో ఘనంగా బాలల దినోత్సవ గ్రామసభ మాలధారుల భిక్ష కార్యక్రమానికి దాతల సహకారం 18వ సంవత్సరం కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమo పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి ఆర్యవైశ్యుల ఐక్యతతోనే సమాజ అభివృద్ధి సహకార పరపతి సంఘం సభ్యులు ఈకేవైసీని చేసుకోండి ఆధునిక భారత నిర్మాణ శిల్పి పండిట్ నెహ్రూ - మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొట్నాక గణపతి జిల్లా కేంద్రంలోని ఆర్. కె. ఫంక్షన్ హల్ లో ఘనంగా గురుశ్రేష్ఠ అవార్డుల ప్రధాన కార్యక్రమం. . : గ్రంథాలయ వారోత్సవాలు సద్వినియోగం చేసుకోవాలి-ఎస్ఐ టి సూర్య శ్రీనివాస్ బాలికల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

బాలికల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

Select Suryaa Now
బాలికల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పార్వతీపురం, మేజర్ న్యూస్ :బాలికల హక్కుల పరిరక్షణతో పాటు వారి విద్య, ఆరోగ్యం, భద్రతకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి అల్లు సత్యనారాయణ పిలుపునిచ్చారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా పార్వతీపురం పట్టణంలోని డీవీఎంఎం హైస్కూల్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు సమాజ అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయని అన్నారు. బాల్య వివాహాల వల్ల బాలికల విద్యకు ఆటంకం కలగడమే కాకుండా, వారి ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం అందించాలని సూచించారు.బాల కార్మిక వ్యవస్థ, బాలలపై లైంగిక వేధింపులు, శారీరక, మానసిక వేధింపులు, బాలల అక్రమ రవాణా వంటి సమస్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పిల్లలకు ఎలాంటి ఆపద లేదా సమస్య ఎదురైనా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098ను సంప్రదించాలని తెలిపారు.బాలికలు విద్యలో రాణిస్తూ ఆత్మవిశ్వాసంతో తమ లక్ష్యాలను చేరుకోవాలని, సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. బాలల రక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్, ఉపాధ్యాయులు వి. ప్రేమీల, కే. భాస్కరరావు, వన్‌స్టాప్ సెంటర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ జి. శాంతికుమారి, లీగల్ ఆఫీసర్ పి. శ్రీధర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఇన్‌స్టిట్యూషనల్ కేర్) ప్రసాదరావు, ప్రొటెక్షన్ ఆఫీసర్ (ఎన్‌ఐసీ) ఎం. అరసవెల్లినాయుడు, శిశుగృహ మేనేజర్ రవణమ్మ, సోషల్ వర్కర్ రమ్య, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ ప్రేమ్ కుమార్, కౌన్సిలర్ జి. తవిటి నాయుడు, పైడిపినాయుడు, విజయ్ కుమార్, హేమంత్ హరికృష్ణ, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 300 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

రిపోర్టర్ : ఎస్ ఎస్ నాయుడు, స్టాఫ్ రిపోర్టర్, పార్వతీపురం.