BREAKING
ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలిః బీసీ నేత, ఎంపీ ఆర్‌ కృష్ణయ్య బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి మున్నేరు- పాలేరు లింకు కెనాల్ రద్దు చేయాలని కోరుతూ ధర్నా మధుమేహంపై అవగాహనతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష పూర్తయ్యేంత వరకు ప్రతి క్షణం అత్యంత విలువైనది - ఎస్పీ అఖిల్ మహాజన్ మాజీ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి - ఎమ్మెల్యే పాయల్ శంకర్ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు_ సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య బస్ స్టాప్ వద్దే నామినేషన్ పారాలు అందజేస్తున్న సచివాలయ సిబ్బంది. కౌటాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు రంగాపురం గ్రామపంచాయతీలో ఘనంగా బాలల దినోత్సవ గ్రామసభ మాలధారుల భిక్ష కార్యక్రమానికి దాతల సహకారం 18వ సంవత్సరం కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమo పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి

ఆధునిక భారత నిర్మాణ శిల్పి పండిట్ నెహ్రూ - మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొట్నాక గణపతి

Select Suryaa Now
ఆధునిక భారత నిర్మాణ శిల్పి పండిట్ నెహ్రూ - మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొట్నాక గణపతి
04 సూర్య తిర్యాణి : ​తిర్యాణి: భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి ఆశయ సాధనకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని తిర్యాణి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొట్నాక గణపతి పిలుపునిచ్చారు. శనివారం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ 137వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.​ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కొట్నాక గణపతి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో నెహ్రూ పోషించిన పాత్ర, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆధునిక భారత నిర్మాణానికి ఆయన వేసిన పునాదులే నేటి దేశ అభివృద్ధికి కారణమన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని నమ్మిన నెహ్రూ, చిన్నారుల విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.​ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ మరియు జవహర్ బాల్ మంచ్ జిల్లా చైర్మన్ నైతం రాంచందర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి బుద్దె విజయ్, జిల్లా కార్యదర్శి కుర్సెంగా శోభన్, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పులి కొమురయ్య, మండల పార్టీ ఉపాధ్యక్షులు ఆత్రం లక్ష్మన్, చుంచు బాపురావు, పార్టీ సీనియర్ నాయకులు బుద్దె శేఖర్, మండల అధికార ప్రతినిధి కూన సురేష్,మండల ప్రధాన కార్యదర్శిలు గొర్య కుమార్, దుర్గం పవన్ కుమార్, ఎస్టీ సెల్ మండల నాయకులు జూగ్నక మారుతి, ఎస్సీ సెల్ మండల నాయకుడు మల్యాల అశోక్, సేవాదళ్ మండల నాయకులు బోరకుంట శంకర్, మండల పార్టీ కార్యదర్శులు కోవ శంకర్, పూసం రాజు, బుద్దె బానయ్య,ఎస్టీ సెల్ మండల నాయకుడు సిడం. జలపతి రావ్ తలండి సర్పంచ్ నైతం మంగు, గ్రామపంచాయతీ కమిటీ ప్రధాన కార్యదర్శి పంద్రం ఏశ్వంత్ రావు, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు