BREAKING
ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలిః బీసీ నేత, ఎంపీ ఆర్‌ కృష్ణయ్య బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి మున్నేరు- పాలేరు లింకు కెనాల్ రద్దు చేయాలని కోరుతూ ధర్నా మధుమేహంపై అవగాహనతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష పూర్తయ్యేంత వరకు ప్రతి క్షణం అత్యంత విలువైనది - ఎస్పీ అఖిల్ మహాజన్ మాజీ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి - ఎమ్మెల్యే పాయల్ శంకర్ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు_ సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య బస్ స్టాప్ వద్దే నామినేషన్ పారాలు అందజేస్తున్న సచివాలయ సిబ్బంది. కౌటాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు రంగాపురం గ్రామపంచాయతీలో ఘనంగా బాలల దినోత్సవ గ్రామసభ మాలధారుల భిక్ష కార్యక్రమానికి దాతల సహకారం 18వ సంవత్సరం కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమo పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి

ఆర్యవైశ్యుల ఐక్యతతోనే సమాజ అభివృద్ధి

Select Suryaa Now
ఆర్యవైశ్యుల ఐక్యతతోనే సమాజ అభివృద్ధి

 

• నిరుపేదలకు అండగా నిలవాలి.. 

• రాజకీయ రంగంలోనూ రాణించాలి – నలమాస్ కాంతయ్య

లక్షెట్టిపేట, సూర్య ప్రతినిధి :

ఆర్యవైశ్యులు కేవలం వ్యాపార రంగానికే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ముఖ్య సలహాదారు నలమాస్ కాంతయ్య పిలుపునిచ్చారు. నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా నిలుస్తూ, రాజకీయ రంగంలోనూ రాణించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సంఘంలో పదవులు చేపట్టడం అంటే బాధ్యతలను స్వీకరించడమేనని, ఆ బాధ్యతలను సమాజ అభ్యున్నతికి వినియోగించాలని పేర్కొన్నారు. శనివారం లక్షెట్టిపేట మండల ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శి ముక్త శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, సమాజంలోని నిరుపేదలను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కొత్త వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చిలువేరు వైకుంఠం నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షుడిగా గౌరిశెట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కటకం అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కుంజర్ల శ్రీనివాస్, కోశాధికారిగా బొద్దుకూరి నరేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను సంఘ నాయకులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ముఖ్య అతిథులకు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వొజ్జల రాజమౌళి, గుండ ప్రభాకర్, లక్షెట్టిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చెట్ల రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ వొజ్జల శ్రీనివాస్, ఐక్య వ్యాపార సంఘం అధ్యక్షుడు మైలారపు సుధాకర్, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు గడ్డం వికాస్, అవోపా జిల్లా ప్రధాన కార్యదర్శి కుంజర్ల శ్రీనివాస్, పట్టణ మహిళా సంఘం అధ్యక్షురాలు నరేందుల సాహితి, ప్రధాన కార్యదర్శి హారతి, కోశాధికారి కాసం స్వప్న, చింతల రంజిత్, బొద్దుకూరి రాజ్‌కుమార్, ఏలుగూరి వేణు తదితరులు పాల్గొన్నారు.