BREAKING
ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలిః బీసీ నేత, ఎంపీ ఆర్‌ కృష్ణయ్య బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి మున్నేరు- పాలేరు లింకు కెనాల్ రద్దు చేయాలని కోరుతూ ధర్నా మధుమేహంపై అవగాహనతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష పూర్తయ్యేంత వరకు ప్రతి క్షణం అత్యంత విలువైనది - ఎస్పీ అఖిల్ మహాజన్ మాజీ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి - ఎమ్మెల్యే పాయల్ శంకర్ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు_ సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య బస్ స్టాప్ వద్దే నామినేషన్ పారాలు అందజేస్తున్న సచివాలయ సిబ్బంది. కౌటాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు రంగాపురం గ్రామపంచాయతీలో ఘనంగా బాలల దినోత్సవ గ్రామసభ మాలధారుల భిక్ష కార్యక్రమానికి దాతల సహకారం 18వ సంవత్సరం కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమo పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి

జిల్లా కేంద్రంలోని ఆర్. కె. ఫంక్షన్ హల్ లో ఘనంగా గురుశ్రేష్ఠ అవార్డుల ప్రధాన కార్యక్రమం. . :

Select Suryaa Now
జిల్లా కేంద్రంలోని ఆర్. కె. ఫంక్షన్ హల్ లో ఘనంగా  గురుశ్రేష్ఠ అవార్డుల ప్రధాన కార్యక్రమం. . :



సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి. :
నిర్మల్ పట్టణంలో ట్రస్మా (తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం) నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ఆర్. కె. ఫంక్షన్ హల్ లో నిర్వహించిన గురుశ్రేష్ఠ అవార్డుల ప్రధాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నిర్మల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీమతి అప్పాల కావ్య , మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు అభినందనీయమన్నారు.
విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి గురుశ్రేష్ఠ అవార్డులతో సత్కరించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎస్పీ రాజు, కత్తి నరేందర్, మాజీ కౌన్సిలర్ తోట నర్సయ్య, ట్రస్మా జిల్లా ప్రతినిధులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యారంగ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.