BREAKING
ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష పూర్తయ్యేంత వరకు ప్రతి క్షణం అత్యంత విలువైనది - ఎస్పీ అఖిల్ మహాజన్ మాజీ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి - ఎమ్మెల్యే పాయల్ శంకర్ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు_ సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య బస్ స్టాప్ వద్దే నామినేషన్ పారాలు అందజేస్తున్న సచివాలయ సిబ్బంది. కౌటాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు రంగాపురం గ్రామపంచాయతీలో ఘనంగా బాలల దినోత్సవ గ్రామసభ మాలధారుల భిక్ష కార్యక్రమానికి దాతల సహకారం 18వ సంవత్సరం కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమo పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి ఆర్యవైశ్యుల ఐక్యతతోనే సమాజ అభివృద్ధి సహకార పరపతి సంఘం సభ్యులు ఈకేవైసీని చేసుకోండి ఆధునిక భారత నిర్మాణ శిల్పి పండిట్ నెహ్రూ - మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొట్నాక గణపతి జిల్లా కేంద్రంలోని ఆర్. కె. ఫంక్షన్ హల్ లో ఘనంగా గురుశ్రేష్ఠ అవార్డుల ప్రధాన కార్యక్రమం. . : గ్రంథాలయ వారోత్సవాలు సద్వినియోగం చేసుకోవాలి-ఎస్ఐ టి సూర్య శ్రీనివాస్ బాలికల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

పరదాల చాటున గిరిజన విద్యార్థుల చదువు కష్టాలు

Select Suryaa Now
పరదాల చాటున గిరిజన విద్యార్థుల చదువు కష్టాలు
సూర్య తిర్యాణి : చుట్టూ ఆకుపచ్చ పరదాలు, కింద మట్టి నేల, చాపపై పుస్తకాల సంచులు. ఎదురుగా ఉపాధ్యాయుడు, ఆయన ముందు నిల్చున్న విద్యార్థులు. ఇదీ తిర్యాణి మండలం గోపేర గ్రామపంచాయతీ పరిధిలోని పునగూడ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల (టీడబ్ల్యూపీఎస్‌) పరిస్థితి. పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో పరదాలు కట్టిన తాత్కాలిక వసతిలోనే తరగతులు నిర్వహిస్తున్నారు.తరగతి గదులు లేకపోవడంతో పిల్లలు చదువుకోవడానికి, ఉపాధ్యాయులు పాఠాలు చెప్పడానికి ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ పరిస్థితిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు రోజూ బడికి వస్తున్నా, కూర్చొని చదువుకోవడానికి సరైన గది లేకపోవడం బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు. 
- పాఠశాల భవనం నిర్మించాలి
ఉన్నతాధికారులు పునగూడకు వచ్చి తరగతులు నిర్వహిస్తున్న ప్రదేశాన్ని పరిశీలించాలని గ్రామస్తులు కోరారు. విద్యార్థులు సౌకర్యంగా కూర్చొని చదువుకునేందుకు అవసరమైన తరగతి గదులతో పాఠశాల భవనాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.