BREAKING
ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష పూర్తయ్యేంత వరకు ప్రతి క్షణం అత్యంత విలువైనది - ఎస్పీ అఖిల్ మహాజన్ మాజీ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి - ఎమ్మెల్యే పాయల్ శంకర్ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు_ సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య బస్ స్టాప్ వద్దే నామినేషన్ పారాలు అందజేస్తున్న సచివాలయ సిబ్బంది. కౌటాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు రంగాపురం గ్రామపంచాయతీలో ఘనంగా బాలల దినోత్సవ గ్రామసభ మాలధారుల భిక్ష కార్యక్రమానికి దాతల సహకారం 18వ సంవత్సరం కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమo పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి ఆర్యవైశ్యుల ఐక్యతతోనే సమాజ అభివృద్ధి సహకార పరపతి సంఘం సభ్యులు ఈకేవైసీని చేసుకోండి ఆధునిక భారత నిర్మాణ శిల్పి పండిట్ నెహ్రూ - మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొట్నాక గణపతి జిల్లా కేంద్రంలోని ఆర్. కె. ఫంక్షన్ హల్ లో ఘనంగా గురుశ్రేష్ఠ అవార్డుల ప్రధాన కార్యక్రమం. . : గ్రంథాలయ వారోత్సవాలు సద్వినియోగం చేసుకోవాలి-ఎస్ఐ టి సూర్య శ్రీనివాస్ బాలికల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

భీరం శ్రీధర్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
భీరం శ్రీధర్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

ఖాజీపేట మేజర్ న్యూస్:పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని శనివారం భీరం శ్రీధర్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్‌లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులను ఉత్సాహపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
​కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రూప్–1 అధికారి భీరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తిదాయక సందేశాన్ని విద్యార్థులకు వివరించారు. మనల్ని నిద్రపోనివ్వకుండా చేసే గొప్ప లక్ష్యాలే నిజమైన కలలని పేర్కొంటూ, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
​పాఠశాల కరస్పాండెంట్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పిల్లలు పెద్దల మాటల కంటే చేతలను ఎక్కువగా అనుసరిస్తారని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మంచి విలువలను ఆచరిస్తూ వారికి ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ వేడుకలు ప్రతి విద్యార్థి జీవితంలో మంచి మార్పుకు నాంది కావాలని పాఠశాల డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్వేత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బోర్రా శివరామిరెడ్డి సూర్య రిపోర్టర్ ఖాజీపేట