BREAKING
ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష పూర్తయ్యేంత వరకు ప్రతి క్షణం అత్యంత విలువైనది - ఎస్పీ అఖిల్ మహాజన్ మాజీ ప్రధాని పండిత్ జవహర్ లాల్ నెహ్రు జయంతి వేడుకలు గ్రంథాలయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి - ఎమ్మెల్యే పాయల్ శంకర్ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు_ సర్పంచ్ పూజారి ఈశ్వరమ్మ బుడ్డయ్య బస్ స్టాప్ వద్దే నామినేషన్ పారాలు అందజేస్తున్న సచివాలయ సిబ్బంది. కౌటాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు రంగాపురం గ్రామపంచాయతీలో ఘనంగా బాలల దినోత్సవ గ్రామసభ మాలధారుల భిక్ష కార్యక్రమానికి దాతల సహకారం 18వ సంవత్సరం కొనసాగుతున్న అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమo పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంః మంత్రి వాకిటి శ్రీహరి ఆర్యవైశ్యుల ఐక్యతతోనే సమాజ అభివృద్ధి సహకార పరపతి సంఘం సభ్యులు ఈకేవైసీని చేసుకోండి ఆధునిక భారత నిర్మాణ శిల్పి పండిట్ నెహ్రూ - మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొట్నాక గణపతి జిల్లా కేంద్రంలోని ఆర్. కె. ఫంక్షన్ హల్ లో ఘనంగా గురుశ్రేష్ఠ అవార్డుల ప్రధాన కార్యక్రమం. . : గ్రంథాలయ వారోత్సవాలు సద్వినియోగం చేసుకోవాలి-ఎస్ఐ టి సూర్య శ్రీనివాస్ బాలికల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

నాయకపుగూడ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

Select Suryaa Now
నాయకపుగూడ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం
సూర్య తిర్యాణి : తిర్యాణి మండలం నాయకపుగూడ గ్రామపంచాయతీ పరిధిలోని గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల (టీడబ్ల్యూపీఎస్‌)లో శనివారం బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ఆనందోత్సాహాలతో పాఠశాలలో సందడి నెలకొంది. కార్యక్రమానికి సర్పంచ్ ఎదుల సుమలత, ఉపసర్పంచ్ పవన్ నంద ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఎదుల సుమలత మాట్లాడుతూ, పిల్లలే దేశ భవిష్యత్తు అని అన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణను అలవర్చుకుని, చదువుపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేందుకు పట్టుదలతో చదవాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువులో రాణించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అభిలషించారు.పాఠశాల ఉపాధ్యాయుడు, గ్రామపంచాయతీ ప్రతినిధులు, అంగన్‌వాడీ టీచర్లు విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారుల ఉత్సాహం మధ్య కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు నైతం దశ్వంత్రావు, వార్డు సభ్యురాలు విమల, అంగన్‌వాడీ టీచర్లు ప్రేమల, మమత, ఎదుల శ్రీనివాస్, మెండ్రపు హరీష్ తదితరులు పాల్గొన్నారు.