ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు
ఖాజీపేట మేజర్ న్యూస్: భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకలను శనివారం స్థానిక బస్టాండ్ కూడలిలో ఘనంగా నిర్వహించారు. ఖాజీపేట ఫ్రెండ్స్ సేవా సంఘం అధ్యక్షుడు షేక్ హాజీ గౌస్ ఆధ్వర్యంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నెహ్రూ, తొలి ప్రధానిగా విద్య, విజ్ఞాన శాస్త్ర, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని కొనియాడారు. పిల్లలంటే ఎంతో ప్రేమ చూపే ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు.ఈకార్యక్రమంలో గున్నంపాటి వెంకటరమణ, షేక్ ఇంతియాజుద్దీన్, ఈ. మొహమ్మద్ హుస్సేన్, ఓబుల్ రెడ్డి, అయ్యవారయ్య తదితరులు పాల్గొన్నారు
బోర్రా శివరామిరెడ్డి సూర్య రిపోర్టర్ ఖాజీపేట