BREAKING
బాలికల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత నాయకపుగూడ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఇంకా వైసీపీపై విమర్శలా చిన్నారుల చిరునవ్వులే దేశానికి వెలుగులు!!! శిరిడి సాయి స్కూల్ అధినేత ముత్యాలప్ప విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనమే పునాది రాజన్న ఆలయ విస్తరణ పనులు శరవేగంగా పూర్తి చేయాలి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరదాల చాటున గిరిజన విద్యార్థుల చదువు కష్టాలు అమరనాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారవేత్త ఈశ్వర్ నాయుడు పంట నష్టాన్ని అంచనా వేసి గుండాల రైతులకు న్యాయం చేయాలి 8వ పీడియాట్రిక్ డయాలసిస్ అండ్ థెరప్యూటిక్ అఫెరిసిస్ మాడ్యూల్ ఫర్ ఎమర్జెన్సీ శిక్షణ కార్యక్రమం కన్నెపల్లిలో ఘనంగా బాల గ్రామ సభ - నెహ్రూ జయంతి వేడుకలు మెడికవర్ ఆసుపత్రిలో ప్రపంచ మధుమేహ దినోత్సవ అవగాహన కార్యక్రమం కౌటాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భీరం శ్రీధర్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సింగరేణి గనులను ప్రైవేటుకు అప్పగిస్తే సహించేది లేదు - ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి - ఎమ్మెల్యేలను కోరిన టీయూడబ్ల్యూజే – ఐజేయూ నాయకులు

Select Suryaa Now
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి  - ఎమ్మెల్యేలను కోరిన టీయూడబ్ల్యూజే – ఐజేయూ నాయకులు
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి. : ఈ నెల 25వ తేదీన  నిర్వహించనున్న తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) నిర్మల్ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని యూనియన్ నాయకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారని, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని యూనియన్ నాయకులు వివరించారు. అయినప్పటికీ అనేక మంది జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులతో పాటు నివాస సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, ఈ విషయంలో ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు.ఈ నెల 25న జరిగే జిల్లా మహాసభల్లో జర్నలిస్టుల సమస్యలు, హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన అంశాలపై చర్చించనున్నట్లు నాయకులు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతులు వివరించారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షులు కొండూరు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంక గారి భూమయ్య, జాతీయ కార్యవర్గ సభ్యులు గాండ్ల రాజశేఖర్, జిల్లా కోశాధికారి వీ. ప్రశాంత్, జిల్లా సోషల్ మీడియా  కన్వీనర్ డి. యోగేష్, జిల్లా ఉపాధ్యక్షులు గుమ్ముల అశోక్, పూసాల పోశెట్టి, వేణుగోపాల్, తన్వీర్, జిల్లా కార్యదర్శులు జల్ద మనోజ్, హనుమాన్లు, భోజా రెడ్డి, రాజేశ్వర్, డీఎస్ మధు, గంగాధర్, చంద్రశేఖర్, సాయిరాజ్ గౌడ్, శివరామకృష్ణ, శ్రీనివాస్, భోజన్న తదితరులు పాల్గొన్నారు.