BREAKING
బాలికల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత నాయకపుగూడ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఇంకా వైసీపీపై విమర్శలా చిన్నారుల చిరునవ్వులే దేశానికి వెలుగులు!!! శిరిడి సాయి స్కూల్ అధినేత ముత్యాలప్ప విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి పుస్తక పఠనమే పునాది రాజన్న ఆలయ విస్తరణ పనులు శరవేగంగా పూర్తి చేయాలి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరదాల చాటున గిరిజన విద్యార్థుల చదువు కష్టాలు అమరనాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన వ్యాపారవేత్త ఈశ్వర్ నాయుడు పంట నష్టాన్ని అంచనా వేసి గుండాల రైతులకు న్యాయం చేయాలి 8వ పీడియాట్రిక్ డయాలసిస్ అండ్ థెరప్యూటిక్ అఫెరిసిస్ మాడ్యూల్ ఫర్ ఎమర్జెన్సీ శిక్షణ కార్యక్రమం కన్నెపల్లిలో ఘనంగా బాల గ్రామ సభ - నెహ్రూ జయంతి వేడుకలు మెడికవర్ ఆసుపత్రిలో ప్రపంచ మధుమేహ దినోత్సవ అవగాహన కార్యక్రమం కౌటాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భీరం శ్రీధర్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సింగరేణి గనులను ప్రైవేటుకు అప్పగిస్తే సహించేది లేదు - ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య

గుడుంబా రహిత గ్రామాలే లక్ష్యం... అక్రమార్కులపై పోలీసుల ఉక్కు పాదం...!

Select Suryaa Now
గుడుంబా రహిత గ్రామాలే లక్ష్యం... అక్రమార్కులపై పోలీసుల ఉక్కు పాదం...!

మహ ముత్తారం, మేజర్ న్యూస్, మహాముత్తారం రెడ్డిపల్లి గ్రామంలో అక్రమంగా గుడుంబా తయారీ, నిల్వ మరియు విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురిపై అడవిముత్తారం పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో అజ్మీరా రాజు నాయక్ అలియాస్ రాజు కుమార్, అజ్మీరా సునీత, ధర్మసోతు అనిల్, ధర్మసోతు లక్ష్మి, జర్పుల కుమార్, జర్పుల తారాబాయిలను భవిష్యత్తులో ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా నివారించేందుకు మహాముత్తారం మండల తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.
ఈ సందర్భంగా అడవిముత్తారం పోలీసులు గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. అక్రమంగా గుడుంబా తయారు చేయడం, నిల్వ ఉంచడం, విక్రయించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గ్రామాల్లో గుడుంబా వంటి నిషేధిత మత్తు పదార్థాల తయారీ, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

రిపోర్టర్; దేవేందర్ ,మహా ముత్తారం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా