BREAKING
విద్య, విజ్ఞానంతో ఉన్నత శిఖరాలకు ఎదగాలి.. కంబాలపల్లి భాస్కర్ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ నాయకులు రేపటి నుంచే పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం నందిగాం: నవంబర్ 14 శనివారం: మేజర్ న్యూస్ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా గ్రంథాలయాధికారి ఎస్.ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEO నరసింహం విచ్చేశారు. ముందుగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బా భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించిన సర్పంచ్ పోలు శ్రీనివాస్ బాలల దినోత్సవంతో మొదలైన గ్రంథాలయ వారోత్సవాలు శాఖ గ్రంథాలయంలో ఘనంగా నెహ్రూ జయంతి అనంతపల్లిలో ఘనంగా బాలల గ్రామసభ 21న ఆళ్లగడ్డలో కైశిక ద్వాదశి వేడుకలు శనగ విత్తనాలేవీ.. అన్నదాతల గోడు వినేదెవరు? అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం. రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు ధరూర్ మెథడిస్ట్ జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ స్నేహ మెహ్ర పేదల వైద్యానికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.51 వేల ఆర్థిక సాయం అందజేత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి

బాలల దినోత్సవంతో మొదలైన గ్రంథాలయ వారోత్సవాలు

Select Suryaa Now
బాలల దినోత్సవంతో మొదలైన గ్రంథాలయ వారోత్సవాలు
సూర్య న్యూస్ అద్దంకి.
అద్దంకి శాఖ గ్రంథాలయం నందు 59వ జాతీయ గ్రంథాల వారోత్సవాలు శనివారం జాతీయ జండా ఆవిష్కరణతో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ వారోత్సవాల ప్రోగ్రామ్ ఆర్గనైజర్ మన్నం  త్రిమూర్తులు అధ్యక్షత వహించారు.
 రిటైర్డ్ ఆర్జెడి డాక్టర్ యూ దేవ పాలన మాట్లాడుతూ భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవలాల్ నెహ్రూ జయంతి రోజున  బాలల దినోత్సవం గా నామకరణం చేశారని.. నేటి బాలలే రేపటి పౌరులుగా సామాజిక బాధ్యతతో ఎదిగి తల్లిదండ్రులకు, గురువర్యులకు మంచి పేరు తీసుకురావాలని అంటూ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న తన మనవరాలు  జి హారిక పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి బాలబాలికులకు తినిపించారు. అద్దంకి ఎన్టీఆర్ నగర్ కు చెందిన  గుంజి  శివ కోటేశ్వరరావు పాఠశాల స్థాయి నుండి.. డిగ్రీ, పీజీ  విశ్వవిద్యాలయం వరకు స్టేట్ ర్యాంక్స్ తో  ప్రభుత్వ విద్యాలయంలోనే చదివి ఇటీవల ఏపీపీఎస్సీ లో ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ గా జాబ్ సాధించారు. నేపథ్యంలో శివ కోటేశ్వరరావును ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బుక్స్ కొనటానికి కూడా ఆర్థిక స్తోమత లేని తనకు తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు తో పాటు గ్రంథాలయాల బుక్స్ ఈ స్థితికి కారణమని, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని శివ కోటేశ్వరరావు చెప్పిన మాటలకు బాలబాలికలు చప్పట్లు, కేరింతలతో అభినందనలు తెలియజేశారు. బాల బాలికలందరికీ  మిఠాయిలు,బిస్కెట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ సిహెచ్ వి ఎల్ వసుంధరాదేవి, ఎక్స్ లైబ్రేరియన్ సిహెచ్ సుగణరావు, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, గాడేపల్లి  దివాకర్ దత్తు, చప్పిడి వీరయ్య, సంధ్రెడ్డి  శ్రీనివాసరావు, అద్దంకి లేవీ  ప్రసాద్, శశిధర్, సిహెచ్ హరి సాయినాథ్, ఏ సురేష్ తో పాటు భాష్యం స్కూల్ బాలబాలికలు పాల్గొన్నారు.