స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి
*ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందజేత
*ఏకగ్రీవ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, బలవంతపు చర్యలకు తావుండకూడదు
* రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా
రాష్ట్రంలో రానున్న పట్టణ స్థానిక సంస్థలు , గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, ప్రతి అభ్యర్థి స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేసుకునేలా, ప్రతి ఓటరు నిర్భయంగా తన ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్పష్టం చేశారు.శనివారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ నందు రాష్ట్రం లోని 12 జిల్లాల ఎస్ పి లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా పట్టణ స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై ఏడిజి (లా అండ్ ఆర్డర్) మధుసూదన్ రెడ్డి, ఐజిపి రాజకుమారి, ఎన్నికల పరిశీలకులు వర ప్రసాద్ లతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్, ఎస్పి ఎల్.సుబ్బారాయుడు, అనంతపురం, కర్నూల్ రేంజ్ ఐజిపి లు షిమోషీ, కే. ప్రవీణ్, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వై.ఎస్.ఆర్ కడప, కర్నూల్, నంద్యాల జిల్లాల ఎస్పి లు ఈ సమావేశానికి నేరుగా పాల్గొనగా, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్య సాయి, అనంతపురం ఎస్పి లు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు.
Raaju బ్యూరో, తిరుపతి జిల్లా,