BREAKING
చొప్పదండిలో విద్యుత్ మోటార్ల చోరీ కేసు ఛేదన ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు దేశాన్ని నిర్మించిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు కడవెరుగు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మహిళా సమైక్య భవనాలకు భూమి పూజ మర్కుక్ - మండల కేంద్రంలో రూ.20 లక్షలతో రెండు భవనాల నిర్మాణం కోసం భూమి పూజ సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. అమరుల త్యాగాలను మరువలేము - సోమశిల దుర్ఘటన జరిగి నేటితో 33 సంవత్సరాలు పూర్తి 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంగారెడ్డిలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి: ఎమ్మెల్యేకు టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకుల వినతి. : మురసు తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ. ఒకే వేదికపై డొనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్: రేజర్‌పే రూ. 6,000 కోట్ల ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. వెల్దుర్తి పట్టణంలో ఆంజనేయ స్వాములకు భిక్ష ఏర్పాటు

ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు దేశాన్ని నిర్మించిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు

Select Suryaa Now
ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు  దేశాన్ని నిర్మించిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ  కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు

తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్ 

ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు

దేశాన్ని నిర్మించిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ

కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు

భారతదేశ తొలి ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ 137వ జయంతి వేడుకలను శనివారం కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నెహ్రూ చిత్రపటాన్ని ఉంచి పూలమాలవేసి, కర్పూర నీరాజనాలతో నారికేలాలు సమర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ప్రజలకు స్వీట్లు చాక్లెట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగాకాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య సంగ్రామంలో నెహ్రూ రాజకీయ ప్రస్థానం మొదలైనా సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపి, ప్రజల్లో అపారమైన ఆదరణ పొందారని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తిరుగులేని నాయకుడిగా, తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని చెప్పారు. స్వతంత్ర భారతదేశం అవతరించిన తర్వాత దేశ సమగ్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి ప్రగతికి పునాదులు వేసింది ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అని చెప్పారు. ఉన్నత భారతావని నిర్మాణానికి ఆయన అనేక చర్యలు తీసుకున్నారని అందులో భాగంగానే నేడు ప్రపంచ అగ్రదేశాల సరసన మన దేశం నిలిచిందన్నారు. కానీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తామే దేశభక్తి పరులలమని చెప్పుకుంటూ నేడు ప్రగతి నిరోధకులుగా మారుతున్నారని ఆరోపించారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య విలువలు, భిన్నత్వంలో ఏకత్వం జవహర్ లాల్ నెహ్రూ లక్ష్యం అన్నారు. నెహ్రూ ఆధునిక, శాస్త్రీయ దృక్పథం కలిగిన భారతదేశాన్ని నిర్మించాలని కలలు కంటే, అదే ఆశయాలను నేటికీ రాహుల్ గాంధీ కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొడ్డ రెడ్డి రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ ఈ దేశాన్ని ప్రేమించినంతగా మరొకరు ప్రేమించలేరని అన్నారు. ఆనాడు ప్రధానిగా ఆయన పడ్డ కష్టాలు, గడిపిన నిద్రలేని రాత్రులు నేటి పాలకులకు మార్గదర్శకంగా నిలిచిందని చెప్పారు. నెహ్రూ ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలు, భారీ పరిశ్రమలు, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ద్వారా దేశ నిర్మాణంపై దృష్టి సారించారని వివరించారు. మరోవైపు, రాహుల్ గాంధీ నేటి పరిస్థితులకు అనుగుణంగా సామాజిక న్యాయం, కుల గణన, సంక్షేమ పథకాలు, రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్నారన్నారు.

కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాంగాటి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని రైతాంగం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అనేక పథకాలను అమలు చేసిన ఘనత ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ  దక్కుతుందన్నారు. భారత్ జోడో యాత్ర' వంటి పాదయాత్రల ద్వారా నేరుగా సామాన్య ప్రజల వద్దకు వెళ్లడం, వారి సమస్యలను వినడం ద్వారా రాహుల్ గాంధీ పోరాట యోధుడిగా నిలుస్తున్నారన్నారు.


పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీల, బీసీ మైనారిటీల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ ఆశయాలను ఆలోచనలతో రాహుల్ గాంధీ నేడు భారత రాజ్యాంగ పరిరక్షణకు పోరాటం చేస్తున్నారని ఇందుకు ప్రజలు తమ మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ భారతదేశంలో మతసామరస్యం, ప్రజాస్వామ్యం పెంపొందడానికి పునాదులు వేసింది జవహర్లాల్ నెహ్రూ అన్నారు. ఈ దేశ సమగ్ర అభివృద్ధికి అహర్నిశలు పాటుపడిన నాయకుడని కొనియాడారు. అయితే మతోన్మాద శక్తులు చరిత్రను వక్రీకరించడానికి కుట్రలు చేస్తున్నాయని దీనిని ప్రజలు నమ్మరని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, జిల్లా ఉపాధ్యక్షుడు గౌతం, నాయకుడు కుమార్, తిరుపతి నగర కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ధవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి