BREAKING
చొప్పదండిలో విద్యుత్ మోటార్ల చోరీ కేసు ఛేదన ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు దేశాన్ని నిర్మించిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు కడవెరుగు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మహిళా సమైక్య భవనాలకు భూమి పూజ మర్కుక్ - మండల కేంద్రంలో రూ.20 లక్షలతో రెండు భవనాల నిర్మాణం కోసం భూమి పూజ సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. అమరుల త్యాగాలను మరువలేము - సోమశిల దుర్ఘటన జరిగి నేటితో 33 సంవత్సరాలు పూర్తి 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంగారెడ్డిలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి: ఎమ్మెల్యేకు టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకుల వినతి. : మురసు తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ. ఒకే వేదికపై డొనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్: రేజర్‌పే రూ. 6,000 కోట్ల ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. వెల్దుర్తి పట్టణంలో ఆంజనేయ స్వాములకు భిక్ష ఏర్పాటు

మహిళా సమైక్య భవనాలకు భూమి పూజ మర్కుక్ - మండల కేంద్రంలో రూ.20 లక్షలతో రెండు భవనాల నిర్మాణం కోసం భూమి పూజ

Select Suryaa Now
మహిళా సమైక్య భవనాలకు భూమి పూజ  మర్కుక్ - మండల కేంద్రంలో రూ.20 లక్షలతో రెండు భవనాల నిర్మాణం కోసం భూమి పూజ

మర్కుక్  : మర్కుక్ మండల కేంద్రంలోని వి.బి.జి. రామ్ నిధుల కింద రెండు మహిళా సమైక్య భవనాల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బుల్లె రాణి మల్లేష్ మాట్లాడుతూ.. మండలం ఏర్పడిన తర్వాత తొలిసారిగా మండల కేంద్రంలో మహిళా సమైక్య భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మహిళా సంఘాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రెండు భవనాలను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షల నిధులతో నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. మహిళా సమాఖ్యలకు ఈ భవనాలు సమావేశాలు నిర్వహించుకోవడానికి, సమైక్యసంఘాల కార్యకలాపాలను కొనసాగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మహేష్,మాజీ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, వార్డు సభ్యులు సతీష్ గౌడ్, పుట్ట రవి రేఖ,పాపోల్ల రాజు కల్పన , కనకయ్య , రాజు, నాగరాజు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ర్యాకం స్వామి నాయకులు బబ్బురి శ్రీనివాస్ గౌడ్, సుధాకర్ రెడ్డి నరేష్ కనకయ్య కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.