BREAKING
ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు దేశాన్ని నిర్మించిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు కడవెరుగు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మహిళా సమైక్య భవనాలకు భూమి పూజ మర్కుక్ - మండల కేంద్రంలో రూ.20 లక్షలతో రెండు భవనాల నిర్మాణం కోసం భూమి పూజ సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. అమరుల త్యాగాలను మరువలేము - సోమశిల దుర్ఘటన జరిగి నేటితో 33 సంవత్సరాలు పూర్తి 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంగారెడ్డిలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి: ఎమ్మెల్యేకు టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకుల వినతి. : మురసు తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ. ఒకే వేదికపై డొనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్: రేజర్‌పే రూ. 6,000 కోట్ల ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. వెల్దుర్తి పట్టణంలో ఆంజనేయ స్వాములకు భిక్ష ఏర్పాటు నర్సాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం... ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం...

అమరుల త్యాగాలను మరువలేము - సోమశిల దుర్ఘటన జరిగి నేటితో 33 సంవత్సరాలు పూర్తి

Select Suryaa Now
అమరుల త్యాగాలను మరువలేము - సోమశిల దుర్ఘటన జరిగి నేటితో 33 సంవత్సరాలు పూర్తి

నాగర్ కర్నూల్ క్రైమ్ , సూర్య న్యూస్: అమరుల త్యాగాలను స్మరించుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణకు సిబ్బంది కృషి చేయాలని జిల్లా అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు అన్నారు. సోమశిల దుర్ఘటనలో మృతి చెందిన పోలీసు అమరవీరులకు ఎస్పీ కార్యాలయంలో శనివారం పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పి మాట్లాడుతూ  పీపుల్స్ వార్ గ్రూపు ప్రాబల్యం ఎక్కువగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో  ఉండటంతో అప్పటి ఎస్పీ పరదేశి నాయుడు నక్సల్స్ అరాచకాలను అరికట్టడానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.  పీపుల్స్ వార్ గ్రూప్ వారు ఎస్పీ పై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని ప్రయత్నించారు.  సోమశిల లోని ఫారెస్ట్ అతిధి గృహాన్ని మావోయిస్టులు పేల్చి వేశారన్న సమాచారం అందుకున్న ఉమ్మడి జిల్లా ఎస్పీ పరదేశి నాయుడు తన సిబ్బందితో కలిసి నవంబర్ 14న సోమశిల వెళ్లారని,  సమాచారం అందుకున్న మావోయిస్టులు ఆయన తిరుగు ప్రయాణం లో ప్రయాణిస్తున్న బస్సు శుద్ధగట్టు మలుపు వద్దకు రాగానే ముందే అమర్చుకున్న మందు పాత్ర పేల్చడంతో ఆ దుర్ఘటనలో ఎస్పీ తో పాటు మిగిలిన సిబ్బంది అక్కడికక్కడే వీరమరణం పొందారనీ ఈ దుర్ఘటన రాష్ట్ర పోలీస్ చరిత్రలో ఒక విషాద ఘట్టంగా మిగిలిందని తెలిపారుఈ దుర్ఘటనలో  పరదేశి నాయుడు తో పాటు ,ఎస్సైలు కిషోర్ కుమార్, శివ ప్రసాద్,హెడ్ కానిస్టేబుల్ రంగారెడ్డి , కానిస్టేబుళ్లు ఎన్ ప్రసాద్ , సుభాన్ , జహాబ్ ఇక్బాల్ ,జయ రాములు,షైక్ హైదర్ లు వీరమరణం పొందినట్టు తెలిపారు. త్యాగాలను స్మరించుకుంటూ నేటితరం పోలీసులు ఆయన ఆశయాలు, ఆదేశాలు తప్పకుండా పాటించాలని ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోలీసులు ధైర్య సాహసాలు ప్రదర్శించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ ఐ జగన్, రాఘవరావు, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై బీజ్జ.శ్రీనివాసులు, ఆర్ఎస్ఐలు శివాజీ, గౌస్ పాషా, ప్రశాంత్, కళ్యాణ్, రాంరెడ్డి లతోపాటు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
----