BREAKING
ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు దేశాన్ని నిర్మించిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు కడవెరుగు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మహిళా సమైక్య భవనాలకు భూమి పూజ మర్కుక్ - మండల కేంద్రంలో రూ.20 లక్షలతో రెండు భవనాల నిర్మాణం కోసం భూమి పూజ సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. అమరుల త్యాగాలను మరువలేము - సోమశిల దుర్ఘటన జరిగి నేటితో 33 సంవత్సరాలు పూర్తి 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంగారెడ్డిలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి: ఎమ్మెల్యేకు టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకుల వినతి. : మురసు తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ. ఒకే వేదికపై డొనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్: రేజర్‌పే రూ. 6,000 కోట్ల ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. వెల్దుర్తి పట్టణంలో ఆంజనేయ స్వాములకు భిక్ష ఏర్పాటు నర్సాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం... ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం...

సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.

Select Suryaa Now
సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.

సంగారెడ్డి, ; సంగారెడ్డి పట్టణంలోని శాంతినగర్‌లో గల సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో భారత తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, పిల్లల ప్రియతమ నాయకుడు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని *బాలల దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.

చిరు నవ్వులు.. చిందులేసిన చిన్నారులు.. ఆటపాటల సందడి..

మూడవ తరగతి విద్యార్థిని కె. నైనిక, నాల్గవ తరగతి విద్యార్థులు ఎన్. అంబిక, జి. నిత్య, పి. అభిజ్ఞ, ఎన్. మోక్ష ప్రదర్శించిన స్వాగత నృత్యగీతంతో కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది.ఈ సందర్భంగా సెయింట్ ఆంథోనీస్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు డా.  ఈ. సలోమోన్ రెడ్డి ,అడ్మినిస్ట్రేటివ్ హెడ్  ఈ. జయ బాల రెడ్డి,డైరెక్టర్  ఈ. విజయ్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్  ఈ. అరుణా రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్  ఎల్. ప్రదీప్త దితరులు కలిసి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.

నేటి బాలలే రేపటి పౌరులు – డైరెక్టర్ ఈ. విజయ్ రెడ్డి…

అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీ ఈ. విజయ్ రెడ్డి మాట్లాడుతూ, “నేటి బాలలే రేపటి పౌరులు. పిల్లలే దేశ భవిష్యత్తుకు పునాదులు” అని పేర్కొన్నారు.భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పిల్లలపై చూపిన ప్రేమాభిమానాలను, దేశాభివృద్ధి పట్ల ఆయనకున్న దార్శనికతను ఈ సందర్భంగా గుర్తుచేశారు. పిల్లలను దేశ సంపదగా భావించి, వారికి నాణ్యమైన విద్య, సరైన మార్గదర్శకత్వం, సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యాసంస్థలపై ఉందన్నారు.ప్రస్తుత ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ )నూతన ఆవిష్కరణలు, మారుతున్న కెరీర్ అవకాశాలతో వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఈ మార్పులకు అనుగుణంగా విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను, కమ్యూనికేషన్ సామర్థ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటలు, కళలు, క్రీడలు, ఇతర సహపాఠ్య కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నిరంతర సాధనతో జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.విద్యార్థులను కేవలం పరీక్షలకు సిద్ధం చేయడం మాత్రమే కాకుండా, భవిష్యత్తు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే సమర్థులుగా, బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే మా విద్యాసంస్థల ప్రధాన లక్ష్యం” అని స్పష్టం చేశారు.విద్యార్థుల సమగ్ర వికాసానికి నిరంతరం కృషి చేస్తున్న ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తూ, పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు.

సాంస్కృతిక ప్రదర్శనలు – క్రీడా పోటీలతో సందడి..

అనంతరం ప్రీ-ప్రైమరీ నుంచి ఏడవ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, వినోదభరిత ప్రదర్శనలతో అందరినీ అలరించారు.విద్యార్థుల్లో ఉత్సాహాన్ని, క్రీడాస్ఫూర్తిని పెంపొందించే ఉద్దేశంతో నిర్వహించిన వివిధ రకాల ఆటల పోటీల్లో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం జ్ఞాపికలను అందజేసి అభినందించింది.చదువుతో పాటు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సృజనాత్మక కార్యకలాపాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే సెయింట్ ఆంథోనీస్ విద్యాసంస్థల లక్ష్యమని ఈ వేడుకలు చాటిచెప్పాయి.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.ప్రతి చిన్నారి ముఖంలో చిరునవ్వు.. ప్రతి విద్యార్థిలో ఆత్మవిశ్వాసం.. ప్రతి అడుగులో అభివృద్ధి.. ఇదే సెయింట్ ఆంథోనీస్ విద్యాసంస్థల ఆకాంక్ష అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు