జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి: ఎమ్మెల్యేకు టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకుల వినతి. :
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి :
ఈ నెల 25న నిర్వహించనున్న టీయూడబ్ల్యూజే–ఐజేయూ నిర్మల్ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని యూనియన్ నాయకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఆర్థిక, నివాస సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. మహాసభల్లో జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొండూరు రవీందర్, ప్రధాన కార్యదర్శి వెంకగారి భూమయ్య, జాతీయ కార్యవర్గ సభ్యుడు గాండ్ల రాజశేఖర్‌తో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు.