BREAKING
సంగారెడ్డిలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి: ఎమ్మెల్యేకు టీయూడబ్ల్యూజే–ఐజేయూ నాయకుల వినతి. : మురసు తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ. ఒకే వేదికపై డొనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్: రేజర్‌పే రూ. 6,000 కోట్ల ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. వెల్దుర్తి పట్టణంలో ఆంజనేయ స్వాములకు భిక్ష ఏర్పాటు నర్సాపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం... ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం... ఉక్రెయిన్‌కు తగ్గిపోతున్న ప్రత్యామ్నాయాలు... వాణిజ్య అంతరాయాలపై ఆగ్నేయాసియా నేతల కీలక సమావేశం.. వాఖాన్ కారిడార్ వాణిజ్య కలలకు బీజింగ్ బ్రేక్ ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దళాలపై ఆరోపణల విచారణకు ఐసీసీ స్వస్తి: అంతర్జాతీయ న్యాయ వర్గాల్లో చర్చ తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డినీ మర్యాదపూర్వకంగా కలిసిన 3వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఆటోనగర్ చల్ల న్యూ ఓర్లీన్స్‌లో క్రూయిజ్ బోట్‌ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్: 32 మందికి గాయాలు పొనకల్ ప్రాథమిక పాఠశాలలో చిల్డ్రన్ ఫ్రెండ్లీ గ్రామసభ

సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ.

Select Suryaa Now
సీఎస్ఈలో గీతం స్కాలర్ కు పీహెచ్.డీ.

పటాన్ చెరు ;  గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి హెచ్.వి. రమణారావు డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘డీప్ లెర్నింగ్ మోడళ్ల మూల్యాంకనంతో పాటు, ఏకీకృతం చేయడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ గ్రేడింగ్ ను మెరుగుపరచడం’పై ఆయన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి. రవిశంకర్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.తన మార్గదర్శనంలో, హిస్టోపాథలాజికల్ చిత్రాలను ఉపయోగించి ప్రోస్టేట్ క్యాన్సర్ ను స్వయంచాలకంగా గుర్తించడం, గ్రేడింగ్ చేయడాన్ని మెరుగుపరచడానికి డాక్టర్ రమణారావు అధునాతన డీప్ లెర్నింగ్ మోడళ్లను అభివృద్ధి చేసినట్టు తెలియజేశారు. ఆయన పరిశోధనలో కన్వల్యూషనల్ న్యూరల్ నెట్ వర్కులు, విజన్ ట్రాన్స్ ఫార్మర్లను ఏకీకృతం చేసి, 98.8 శాతం వర్గీకరణ కచ్చితత్వాన్ని సాధించారని, ఇది కచ్చితమైన, అర్థవంతమైన, సమర్థవంతమైన క్యాన్సర్ నిర్ధారణకు మద్దతు ఇచ్చే గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని వివరించారు.డాక్టర్ రమణారావు సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి సయ్యద్ అక్బరుద్దీన్, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర ఎస్.మహబూబ్ బాషా, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించి, ఆయన తన విద్య, పరిశోధన వృత్తిలో నిరంతర విజయం సాధించాలని వారు ఆకాంక్షించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.