వెల్దుర్తి పట్టణంలో ఆంజనేయ స్వాములకు భిక్ష ఏర్పాటు
వెల్దుర్తి, మేజర్ న్యూస్: వెల్దుర్తి పట్టణంలోని స్థానిక పసుల దేవాలయ ఆవరణలో స్వతంత్ర అభ్యర్థి రమేష్ శెట్టి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఆయన స్వయంగా స్వాములకు భోజనాలను వడ్డించారు.ఈ కార్యక్రమంలో గురుస్వాములు చిరంజీవి స్వామి, తెలుగు మధుస్వామి, బాలుస్వామి, రామాంజనేయ స్వామిలతో పాటు వంశీశెట్టి, రాము ప్రసాద్ శెట్టి, సురేందర్ శెట్టి తదితరులు పాల్గొన్నారు