BREAKING
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు.. నాటు కోళ్ల పెంపకంతో రైతులకు సిరుల పంట! పీజీఆర్‌ఎస్‌ సేవలపై ప్రజలు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తమ అభిప్రాయాలు తెలిపాలి దండుగోపాలపురం పంచాయతీ ఎన్నికలు: నిజాయితీకి పట్టం కట్టాలి.. యువతకు గ్రామాభివృద్ధిలో అవకాశం కల్పించాలి! అమ్మానాన్నలకు వృద్ధాశ్రమాలే దిక్కవుతున్నాయా? పోరుమామిళ్లవైసీపీలో మొదలైన వర్గ పోరు పోరుమామిళ్ల సర్పంచ్ అభ్యర్థిగా షేక్ సునిహ ను ప్రకటించిన నల్లేరు విశ్వనాథరెడ్డి స్వదేశీ నీటి శిక్షణకు ర్యాన్ రేనాల్డ్స్, బ్లేక్ లైవ్లీ భారీ విరాళం.. 5 లక్షల డాలర్ల సాయం! మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థుల అవగాహన ర్యాలీ రెంజల్ లో దొంగల బీభత్సం... 20 తులాల బంగారం చోరీ తొమ్మిది రోజుల్లోనే రూ.1100 కోట్ల మార్కు.. బాక్సాఫీస్‌ను దున్నేస్తున్న రామాయణ! తెలంగాణ గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ స్కీమ్ పుస్తెలతాడు చోరీ. కాలు గాయంతో ఇబ్బందులు.. అవకాశాల కోసం వేడుకుంటున్న జోష్ నటుడు శరద్ కపూర్! మునిసిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: కూన రవికుమార్ రామాయణ షూటింగ్‌లో లారా దత్తాకు వింత అనుభవం.. ఇరుక్కుపోయిన బ్రాస్‌లెట్‌ను కట్ చేసిన సిబ్బంది! బాలల ఉజ్వల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే పునాది: మంత్రి అచ్చెన్నాయుడు

బాలల ఉజ్వల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే పునాది: మంత్రి అచ్చెన్నాయుడు

Select Suryaa Now
బాలల ఉజ్వల భవిష్యత్తుకు నాణ్యమైన విద్యే పునాది: మంత్రి అచ్చెన్నాయుడు

 

కోటబొమ్మాళి, నవంబర్ 14, మేజర్ న్యూస్:

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని చిన్నారులందరికీ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలలే భావి భారత పౌరులని, వారి అభ్యున్నతిపైనే రాష్ట్ర, దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని పేర్కొన్నారు.

ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారిలో దాగి ఉన్న సృజనాత్మకత, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. విద్యతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత, నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే బాలలు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఆకాంక్షించారు.

చిన్నారుల ఆశయాలకు తగిన అవకాశాలు కల్పిస్తూ, వారి కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని తెలిపారు. బాలల సమగ్ర వికాసానికి, ఉజ్వల భవిష్యత్తుకు అవసరమైన నాణ్యమైన విద్య, మెరుగైన వాతావరణం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలని, వారి ప్రతిభాపాటవాలు దేశ ప్రగతికి దోహదపడాలని ఆకాంక్షిస్తూ మరోసారి బాలలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

రిపోర్టర్ గంట అప్పన్న  

కోటబొమ్మాళి