BREAKING
పొనకల్ ప్రాథమిక పాఠశాలలో చిల్డ్రన్ ఫ్రెండ్లీ గ్రామసభ హార్ముజ్ జలసంధి సమీపంలో మైన్లను ఢీకొన్న చమురు ట్యాంకర్లు.. అంగన్వాడీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలనీ ఎమ్మెల్యేకు వినతి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు.. నాటు కోళ్ల పెంపకంతో రైతులకు సిరుల పంట! పీజీఆర్‌ఎస్‌ సేవలపై ప్రజలు క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తమ అభిప్రాయాలు తెలిపాలి దండుగోపాలపురం పంచాయతీ ఎన్నికలు: నిజాయితీకి పట్టం కట్టాలి.. యువతకు గ్రామాభివృద్ధిలో అవకాశం కల్పించాలి! అమ్మానాన్నలకు వృద్ధాశ్రమాలే దిక్కవుతున్నాయా? పోరుమామిళ్లవైసీపీలో మొదలైన వర్గ పోరు పోరుమామిళ్ల సర్పంచ్ అభ్యర్థిగా షేక్ సునిహ ను ప్రకటించిన నల్లేరు విశ్వనాథరెడ్డి స్వదేశీ నీటి శిక్షణకు ర్యాన్ రేనాల్డ్స్, బ్లేక్ లైవ్లీ భారీ విరాళం.. 5 లక్షల డాలర్ల సాయం! మాదకద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థుల అవగాహన ర్యాలీ రెంజల్ లో దొంగల బీభత్సం... 20 తులాల బంగారం చోరీ తొమ్మిది రోజుల్లోనే రూ.1100 కోట్ల మార్కు.. బాక్సాఫీస్‌ను దున్నేస్తున్న రామాయణ! తెలంగాణ గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ స్కీమ్ పుస్తెలతాడు చోరీ. కాలు గాయంతో ఇబ్బందులు.. అవకాశాల కోసం వేడుకుంటున్న జోష్ నటుడు శరద్ కపూర్!

తెలంగాణ గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ స్కీమ్

Select Suryaa Now
తెలంగాణ గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ స్కీమ్
 భారత్ జోడో యాత్ర మరియు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం హైదరాబాద్‌లో గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ వర్కర్లతో కలిసి భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. మాదాపూర్‌లోని శిల్పకళా వేదిక (శిల్పారామం) నుంచి జయభేరి గ్రౌండ్స్ వరకు సాగిన ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా గిగ్ వర్కర్ల స్కూటీలపై వెనుక కూర్చుని (పిలియన్ రైడ్) ప్రయాణించి వారిలో ఉత్సాహం నింపారు. ర్యాలీ అనంతరం జయభేరి గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో కలిసి సంక్షేమ పథకం ప్రారంభించారు.తెలంగాణ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
సభలో రాహుల్ గాంధీ ప్రకటించిన ప్రధాన అంశాలు:
  • రూ. 15 లక్షల బీమా రక్షణ: రాష్ట్రంలోని ప్రతి గిగ్ వర్కర్‌కు రూ. 5 లక్షల ప్రమాద బీమా మరియు రూ. 10 లక్షల ఆరోగ్య బీమా
  • ప్రతి లావాదేవీలో 1% వాటా: ఫుడ్ డెలివరీలు, క్యాబ్ రైడ్‌లతో సహా ప్రతి లావాదేవీ విలువలో 1 శాతం మొత్తాన్ని కంపెనీల నుంచి సేకరించి, గిగ్ వర్కర్స్ బోర్డు ద్వారా నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ
  • ఉచిత వై-ఫై విశ్రాంతి కేంద్రాలు: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు పని వేళల్లో వాహనాలు పార్క్ చేసుకుని విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో ప్రత్యేకంగా వై-ఫై సదుపాయం ఉన్న రెస్ట్ జోన్‌లను ఏర్పాటు
  • డేటా పారదర్శకత: "డేటా మీది, శ్రమ మీది.. కానీ ఇప్పటివరకు మీ డేటాను మీరే చూసుకునే అవకాశం లేకుండా పోయింది" అని వ్యాఖ్యానించిన రాహుల్, కొత్త చట్టం ద్వారా వర్కర్లు తమ పని గంటలు, డెలివరీలు, చెల్లింపుల పూర్తి వివరాలను నేరుగా తమ మొబైల్ ఫోన్లలో చూసుకునే వెసులుబాటు
కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు:
ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. బడా కార్పొరేట్ కంపెనీలు లాభాలు గడిస్తుంటే, గిగ్ వర్కర్లను ఆధునిక వెట్టిచాకిరీ వైపు నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను దేశ ఆర్థిక వ్యవస్థకు పునాదిగా భావిస్తుందని, వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.