చొప్పదండిలో విద్యుత్ మోటార్ల చోరీ కేసు ఛేదన
సూర్య చొప్పదండి ప్రాంతంలో చోరీకి గురైన విద్యుత్ మోటార్ల కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఏసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడిస్తూ, చోరీలకు పాల్పడిన నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.