కొమురవెల్లిలో ఘనంగా ముగిసిన పది రోజుల పాటరీ శిక్షణ
కొమురవెల్లి:గ్రామీణ కుమ్మరి కళాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించి, సంప్రదాయ కుమ్మరి వృత్తిని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) ఆధ్వర్యంలో కొమురవెల్లి గ్రామంలో నిర్వహించిన పది రోజుల పాటరీ శిక్షణ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది.ఈ పది రోజుల శిక్షణలో కుమ్మరి వృత్తికి సంబంధించిన ఆధునిక తయారీ పద్ధతులు, పాటరీ ఉత్పత్తుల తయారీ విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, వివిధ రకాల మట్టి ఉత్పత్తుల తయారీపై నిపుణులు శిక్షణార్థులకు అవగాహన కల్పించారు. సంప్రదాయ వృత్తిలో ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని వివరించారు.ఈ కార్యక్రమానికి ఆన్‌లైన్ మానిటరింగ్ అండ్ అబ్జర్వర్‌గా KVIC డైరెక్టర్ డాక్టర్ మనోజ్ లంక, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎన్. లతాదేవి, KVIC టెక్నికల్ ఎక్స్‌పర్ట్ సంజూరావు, అఖిల భారత కుమ్మర ప్రజాపతి కుంభకార్ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శివానంద్, మాస్టర్ ట్రైనర్ వినయ్ పాల్గొన్నారు.అదేవిధంగా కొమురవెల్లి గ్రామ ఉపసర్పంచ్ పోతుగంటి శ్రీనివాస్, కుమ్మరి సంఘం మండల అధ్యక్షుడు పోతుగంటి కొమురవెల్లి, గ్రామ అధ్యక్షుడు శ్రీను, టీమ్ సభ్యులు పోతుగంటి బిక్షపతి, పోతుగంటి రవి, KVIC సెంటర్ ఇన్‌చార్జి తరిగొప్పుల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.పది రోజుల పాటు శిక్షణ పొందిన కుమ్మరి వృత్తిదారులు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు చేతివృత్తిదారులకు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడంతో పాటు, తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయ వృత్తికి ఆధునికతను జోడించేందుకు దోహదపడతాయని నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ చేతివృత్తిదారులను ప్రోత్సహిస్తూ శిక్షణ అందించిన KVIC అధికారులకు కుమ్మరి సంఘం సభ్యులు, గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
SURYA REPORTER