BREAKING
హైదరాబాద్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న జారె ఆదినారాయణ పోలాకిలో మధుమేహ వ్యాధి అవగాహన కార్యక్రమం. బాలల హక్కులపై ప్రత్యేక గ్రామసభలు ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్.. ఒకరి మృతి కొమురవెల్లిలో ఘనంగా ముగిసిన పది రోజుల పాటరీ శిక్షణ బాల దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు చొప్పదండిలో విద్యుత్ మోటార్ల చోరీ కేసు ఛేదన ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు దేశాన్ని నిర్మించిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు కడవెరుగు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మహిళా సమైక్య భవనాలకు భూమి పూజ మర్కుక్ - మండల కేంద్రంలో రూ.20 లక్షలతో రెండు భవనాల నిర్మాణం కోసం భూమి పూజ సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. అమరుల త్యాగాలను మరువలేము - సోమశిల దుర్ఘటన జరిగి నేటితో 33 సంవత్సరాలు పూర్తి 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సంగారెడ్డిలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు

బాలల హక్కులపై ప్రత్యేక గ్రామసభలు

Select Suryaa Now
బాలల హక్కులపై ప్రత్యేక గ్రామసభలు

 నవాబుపేట సూర్య న్యూస్:జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని 42గ్రామపంచాయతీల్లో శనివారం బాలల సంక్షేమంపై ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు.ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రామసభల్లో 18ఏళ్లలోపు బాలబాలికలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీడీవో జయరాం నాయక్ మాట్లాడుతూ..బాలల హక్కుల పరిరక్షణ,వారి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక గ్రామసభలు నిర్వహించినట్లు తెలిపారు.పిల్లలకు సకాలంలో టీకాలు,పౌష్టికాహారం,మెరుగైన వైద్యం,పాఠశాలల్లో హాజరు,సురక్షిత తాగునీరు,పారిశుద్ధ్యం వంటి అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు.బాల్యవివాహాలు,బాలకార్మిక వ్యవస్థ,బాలల అక్రమ రవాణా,వేధింపులు,హింస,మత్తు పదార్థాల వినియోగం వంటి సమస్యల నివారణపై అవగాహన కల్పించి,బాలల సంక్షేమానికి అవసరమైన అంశాలపై తీర్మానాలు చేసినట్లు వివరించారు.బాలబాలికలు తమ సమస్యలను నిర్భయంగా గ్రామసభల దృష్టికి తీసుకురావడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు,18 ఏళ్లలోపు బాలబాలికలు,గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.