ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్.. ఒకరి మృతి
సూర్య జగిత్యాల ప్రతినిధి :కోరుట్ల మండలం మాదాపూర్ రైస్ మిల్లు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వారిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికుల ద్వారా సమాచారం. మృతుడి వివరాలు, క్షతగాత్రుడి పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.