జీపీఓపై చర్యలు తీసుకోవాలి
కందుకూరు, మేజర్ న్యూస్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తుల ధ్రువీకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్న కొత్తగూడ గ్రామ జీపీఓ వెంకట నర్సింహారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆర్డివో, తహసీల్దార్ లకు సామ సురేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు కోసం అక్టోబర్ 31న దరఖాస్తు చేసుకున్నప్పటికీ, 16 రోజులుగా ధ్రువీకరణకు జీపీఓ రాలేదని ఆరోపించారు. చివరి రోజు దరఖాస్తును తిరస్కరిస్తానంటూ హెచ్చరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి, దరఖాస్తుదారులకు ఇబ్బందులు కలగకుండా చూడటంతో పాటు బాధ్యులపై శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్, కందుకూరు, రంగారెడ్డి జిల్లా