BREAKING
పేదల వైద్యానికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.51 వేల ఆర్థిక సాయం అందజేత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి జీపీఓపై చర్యలు తీసుకోవాలి విద్యార్థుల్లో సృజనాత్మకతకు ప్రోత్సాహం.. సేవా సంకల్ప అభియాన్‌లో పోటీలు హస్నాబాద్‌లో మహిళపై మరో మహిళ కత్తితో దాడి.. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహ విద్యార్థులకు దోమతెరల పంపిణీ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు – డాక్టర్ కటారు మానస శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం హైదరాబాద్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న జారె ఆదినారాయణ పోలాకిలో మధుమేహ వ్యాధి అవగాహన కార్యక్రమం. బాలల హక్కులపై ప్రత్యేక గ్రామసభలు ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్.. ఒకరి మృతి కొమురవెల్లిలో ఘనంగా ముగిసిన పది రోజుల పాటరీ శిక్షణ బాల దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు చొప్పదండిలో విద్యుత్ మోటార్ల చోరీ కేసు ఛేదన ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు దేశాన్ని నిర్మించిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు

పేదల వైద్యానికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.51 వేల ఆర్థిక సాయం అందజేత

Select Suryaa Now
పేదల వైద్యానికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.51 వేల ఆర్థిక సాయం అందజేత

కీసర, మేజర్ న్యూస్: ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండలం గోధుమకుంట గ్రామానికి చెందిన వంగేటి వెంకట్ రెడ్డికి వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.51 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే మల్లారెడ్డి అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడికి ఈ ఆర్థిక సహాయం కొంత ఊరటనివ్వనుంది. ఈ సందర్భంగా లబ్ధిదారుడు వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం అందించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకిటి మహేందర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మంచాల రాజలింగం, నాయకులు వి. మహేందర్ రెడ్డి, ఎస్. కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.