BREAKING
పేదల వైద్యానికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.51 వేల ఆర్థిక సాయం అందజేత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి జీపీఓపై చర్యలు తీసుకోవాలి విద్యార్థుల్లో సృజనాత్మకతకు ప్రోత్సాహం.. సేవా సంకల్ప అభియాన్‌లో పోటీలు హస్నాబాద్‌లో మహిళపై మరో మహిళ కత్తితో దాడి.. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహ విద్యార్థులకు దోమతెరల పంపిణీ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు – డాక్టర్ కటారు మానస శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం హైదరాబాద్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న జారె ఆదినారాయణ పోలాకిలో మధుమేహ వ్యాధి అవగాహన కార్యక్రమం. బాలల హక్కులపై ప్రత్యేక గ్రామసభలు ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్.. ఒకరి మృతి కొమురవెల్లిలో ఘనంగా ముగిసిన పది రోజుల పాటరీ శిక్షణ బాల దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు చొప్పదండిలో విద్యుత్ మోటార్ల చోరీ కేసు ఛేదన ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు దేశాన్ని నిర్మించిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు

విద్యార్థుల్లో సృజనాత్మకతకు ప్రోత్సాహం.. సేవా సంకల్ప అభియాన్‌లో పోటీలు

Select Suryaa Now
విద్యార్థుల్లో సృజనాత్మకతకు ప్రోత్సాహం.. సేవా సంకల్ప అభియాన్‌లో పోటీలు

పూడూరు, మేజర్ న్యూస్: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో దేశభక్తి, సామాజిక స్పృహను పెంపొందించడమే లక్ష్యంగా సేవా సంకల్ప అభియాన్ ఆధ్వర్యంలో డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా కంకల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి సేవా సంకల్ప అభియాన్ రాష్ట్ర కన్వీనర్ పెద్దింటి నవీన్ కుమార్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సదానంద రెడ్డి, రవీందర్ కంకల్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. విద్యార్థులు చదువుతో పాటు కళలు, సృజనాత్మక రంగాల్లోనూ ఆసక్తి కనబరచాలని, ఇలాంటి పోటీలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీస్తాయని అన్నారు. భావిభారత పౌరులుగా ఎదుగుతూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ప్రధాని జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడమే సేవా సంకల్ప అభియాన్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్ప, కన్నయ్యల రాజు, మనోహర్ గౌడ్, ఆంజనేయులు, నర్సింలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.