BREAKING
స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి జీపీఓపై చర్యలు తీసుకోవాలి విద్యార్థుల్లో సృజనాత్మకతకు ప్రోత్సాహం.. సేవా సంకల్ప అభియాన్‌లో పోటీలు హస్నాబాద్‌లో మహిళపై మరో మహిళ కత్తితో దాడి.. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహ విద్యార్థులకు దోమతెరల పంపిణీ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు – డాక్టర్ కటారు మానస శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం హైదరాబాద్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న జారె ఆదినారాయణ పోలాకిలో మధుమేహ వ్యాధి అవగాహన కార్యక్రమం. బాలల హక్కులపై ప్రత్యేక గ్రామసభలు ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్.. ఒకరి మృతి కొమురవెల్లిలో ఘనంగా ముగిసిన పది రోజుల పాటరీ శిక్షణ బాల దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు చొప్పదండిలో విద్యుత్ మోటార్ల చోరీ కేసు ఛేదన ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు దేశాన్ని నిర్మించిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు కడవెరుగు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

హస్నాబాద్‌లో మహిళపై మరో మహిళ కత్తితో దాడి.. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స

Select Suryaa Now
హస్నాబాద్‌లో మహిళపై మరో మహిళ కత్తితో దాడి.. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స

దుద్యాల, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హస్నాబాద్ గ్రామంలో ఇద్దరు మహిళల మధ్య చోటుచేసుకున్న ఘటన కత్తి దాడికి దారితీసింది. ఒక మహిళపై మరో మహిళ కత్తితో పలుమార్లు దాడి చేయడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హస్నాబాద్ గ్రామానికి చెందిన మంగి అంజమ్మ, సక్కిరి మంజుల ఇద్దరూ స్నేహంగా ఉంటూ కలిసి కూలి పనులకు వెళ్లేవారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో మంజుల ఇంటికి అంజమ్మ వెళ్లింది. ఇద్దరూ కలిసి ఇంట్లో ఉడికించిన కందికాయలు తిన్నారు. అనంతరం నీళ్లు తీసుకురావడానికి మంజుల లోపలి గదిలోకి వెళ్లగా, అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో అంజమ్మ ఆమెపై దాడికి పాల్పడినట్లు సమాచారం. మెడ, చేతి భాగాల్లో పలుమార్లు కత్తితో దాడి చేయడంతో మంజులకు తీవ్ర రక్తస్రావమైంది. బాధితురాలి కేకలు విన్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకోవడంతో నిందితురాలు కత్తిని అక్కడే వదిలి పరారైంది. గాయపడిన మంజులను తొలుత కొడంగల్ ఆసుపత్రికి, అనంతరం తాండూరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కొడంగల్ పోలీసులు గ్రామానికి చేరుకుని దాడికి పాల్పడిన మంగి అంజమ్మను అర్ధరాత్రి అరెస్ట్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉండగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.