BREAKING
హస్నాబాద్‌లో మహిళపై మరో మహిళ కత్తితో దాడి.. తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహ విద్యార్థులకు దోమతెరల పంపిణీ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు – డాక్టర్ కటారు మానస శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం హైదరాబాద్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న జారె ఆదినారాయణ పోలాకిలో మధుమేహ వ్యాధి అవగాహన కార్యక్రమం. బాలల హక్కులపై ప్రత్యేక గ్రామసభలు ఆర్టీసీ బస్సును ఢీకొన్న బైక్.. ఒకరి మృతి కొమురవెల్లిలో ఘనంగా ముగిసిన పది రోజుల పాటరీ శిక్షణ బాల దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు చొప్పదండిలో విద్యుత్ మోటార్ల చోరీ కేసు ఛేదన ఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలు దేశాన్ని నిర్మించిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అర్బన్ జిల్లా అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు కడవెరుగు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మహిళా సమైక్య భవనాలకు భూమి పూజ మర్కుక్ - మండల కేంద్రంలో రూ.20 లక్షలతో రెండు భవనాల నిర్మాణం కోసం భూమి పూజ సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు. సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.

శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం

Select Suryaa Now
శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం

ఏలూరు, మేజర్ న్యూస్: స్థానిక ఆర్ ఆర్ పేట బెండపూడివారి వీధి లోని శ్రీ కృష్ణ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ&ట్రామాకేర్ నందు శనివారం ఉదయం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో  హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బి. కృష్ణ రోగులను పరిక్షించి అవసరం అయిన వారికి ఎక్సరే, రక్త పరీక్షలు, బియమ్ డి (ఎముకల సాంద్రత), స్కానింగ్ చేసి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం పలు ఆరోగ్య సమస్యలకు సూచనలు అందజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో వందలాది మంది రోగులకు సేవలందించారు. ఈ సందర్బంగా డాక్టర్ బి. కృష్ణ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని తలచి వైద్యం ప్రతి పేదవానికి సత్వరమే అందుబాటులో ఉండాలనే మంచి ఉద్దేశ్యం కలిగి వారి తండ్రిగారైన రాముడు నుండి ప్రేరణ పొంది గత 49 నెలల(నాలుగు సంవత్సరాల)నుండి ప్రతి నెల 2 వ శనివారం పేదలకు ఉచిత వైద్య శిబిరం  నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్న పిల్లలను జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచాలని, స్వయంగా ఇంట్లో వండిన వంటకాలను వారికి అలవాటు చేయాలని తెలిపారు. ఏలూరు చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఉపయోగించుకునే రోగుల సంఖ్య ప్రతినెలా పెరుగుతూ వస్తోందని చెప్పారు.  రోగులకు ఉచితంగా మందుల కిట్లను పంపిణీ చేశారు.  ఈకార్యక్రమంలో డాక్టర్ రవి కిరణ్, డాక్టర్ దిలిప్, ప్రశాంతి, లయన్స్ క్లబ్ వారు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 175మంది రోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు.