BREAKING
రేపటి నుంచే పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం నందిగాం: నవంబర్ 14 శనివారం: మేజర్ న్యూస్ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా గ్రంథాలయాధికారి ఎస్.ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEO నరసింహం విచ్చేశారు. ముందుగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బా భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించిన సర్పంచ్ పోలు శ్రీనివాస్ బాలల దినోత్సవంతో మొదలైన గ్రంథాలయ వారోత్సవాలు శాఖ గ్రంథాలయంలో ఘనంగా నెహ్రూ జయంతి అనంతపల్లిలో ఘనంగా బాలల గ్రామసభ 21న ఆళ్లగడ్డలో కైశిక ద్వాదశి వేడుకలు శనగ విత్తనాలేవీ.. అన్నదాతల గోడు వినేదెవరు? అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం. రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు ధరూర్ మెథడిస్ట్ జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ స్నేహ మెహ్ర పేదల వైద్యానికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.51 వేల ఆర్థిక సాయం అందజేత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి జీపీఓపై చర్యలు తీసుకోవాలి విద్యార్థుల్లో సృజనాత్మకతకు ప్రోత్సాహం.. సేవా సంకల్ప అభియాన్‌లో పోటీలు

శనగ విత్తనాలేవీ.. అన్నదాతల గోడు వినేదెవరు?

Select Suryaa Now
శనగ విత్తనాలేవీ.. అన్నదాతల గోడు వినేదెవరు?

పామూరు, మేజర్ న్యూస్ :  సాగుకు సమయం ఆసన్నమైంది. పొలాలు సిద్ధమయ్యాయి. విత్తనాల కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. కానీ వ్యవసాయ శాఖ నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన కరువైంది. రబీ సీజన్‌లో శనగ సాగుకు సిద్ధమైన పామూరు మండల రైతులకు రాయితీ శనగ విత్తనాల కొరత తీవ్ర సమస్యగా మారింది. మండలానికి 1,000 క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరమని జిల్లా అధికారులకు తెలియజేసినా ఇప్పటివరకు కేవలం 100 క్వింటాళ్లు మాత్రమే సరఫరా కావడం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. మిగిలిన 900 క్వింటాళ్ల విత్తనాల జాడ లేకపోవడంతో అసలు నిర్లక్ష్యం ఎవరిది రైతుల సాగు అవసరాలు అధికారులకు పట్టవా అన్న ప్రశ్నలు అన్నదాతల నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వచ్చిన 100 క్వింటాళ్ల శనగ విత్తనాలు పడమరకట్టకిందపల్లి పంచాయతీకి చేరాయి. మండలానికి అవసరమైన వెయ్యి క్వింటాళ్లలో పదో వంతు మాత్రమే అందుబాటులోకి రావడంతో మిగిలిన గ్రామాల రైతులకు విత్తనాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.

 పామూరు మండలంలోని వగ్గంపల్లి, గుమ్మలంపాడు, చింతలపాలెం, దూబగుంట, దాదిరెడ్డిపల్లి, పడమరకట్టకిందపల్లి, డీవీపల్లి తదితర గ్రామాల్లో రైతులు శనగ సాగు కోసం ఇప్పటికే పొలాలను దుక్కులు దున్ని మందు ఎత్తించి సిద్ధం చేసుకున్నారు. విత్తనాలు వేసేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో కొరత ఏర్పడటంతో సాగు పనులు ముందుకు సాగడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనలు రైతులను మరింత కలవరపెడుతున్నాయి. వర్షాలు కురిసేలోపు విత్తనాలు అందకపోతే సాగు సమయం చేజారిపోయి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది రబీ సీజన్‌లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాయితీ విత్తనాలు పంపిణీ చేసిన అధికారులు ఈ ఏడాది ఎందుకు పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింద మండలానికి వెయ్యి క్వింటాళ్ల విత్తనాలు అవసరమని తెలిసినా కేవలం వంద క్వింటాళ్లు మాత్రమే పంపడం వెనుక కారణమేమిటి మిగిలిన 900 క్వింటాళ్లను జిల్లా అధికారులు ఎందుకు సరఫరా చేయడం లేదు రైతుల సాగు అవసరాలపై ముందస్తు ప్రణాళిక లేదా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పామూరు మండలానికి రావాల్సిన మిగిలిన 900 క్వింటాళ్ల రాయితీ శనగ విత్తనాలను యుద్ధప్రాతిపదికన తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని అధికారులతో మాట్లాడి విత్తనాల సరఫరా జరిగేలా చూడాలని కోరుతున్నారు. కీలకమైన రబీ సాగు సమయంలో విత్తనాల కొరతతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అన్నదాతలను ఆదుకోవాలని రైతాంగం విజ్ఞప్తి చేస్తున్నారు.