BREAKING
రేపటి నుంచే పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం నందిగాం: నవంబర్ 14 శనివారం: మేజర్ న్యూస్ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా గ్రంథాలయాధికారి ఎస్.ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా MEO నరసింహం విచ్చేశారు. ముందుగా జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా బా భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించిన సర్పంచ్ పోలు శ్రీనివాస్ బాలల దినోత్సవంతో మొదలైన గ్రంథాలయ వారోత్సవాలు శాఖ గ్రంథాలయంలో ఘనంగా నెహ్రూ జయంతి అనంతపల్లిలో ఘనంగా బాలల గ్రామసభ 21న ఆళ్లగడ్డలో కైశిక ద్వాదశి వేడుకలు శనగ విత్తనాలేవీ.. అన్నదాతల గోడు వినేదెవరు? అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం. రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలు ధరూర్ మెథడిస్ట్ జాతరకు పటిష్ట పోలీస్ బందోబస్తు.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ స్నేహ మెహ్ర పేదల వైద్యానికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.51 వేల ఆర్థిక సాయం అందజేత స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేయాలి జీపీఓపై చర్యలు తీసుకోవాలి విద్యార్థుల్లో సృజనాత్మకతకు ప్రోత్సాహం.. సేవా సంకల్ప అభియాన్‌లో పోటీలు

21న ఆళ్లగడ్డలో కైశిక ద్వాదశి వేడుకలు

Select Suryaa Now
21న ఆళ్లగడ్డలో కైశిక ద్వాదశి వేడుకలు

ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ ; తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 21వ తేదీ, శనివారం, సాయంత్రం ఐదు గంటలకు ఆళ్ళగడ్డ పట్టణం ఆర్టీసీ బస్టాండుకు ఎదురుగా ఉన్న ఆదర్శనగర్ నగర్ కాలనీలోని శ్రీరామాలయం నందు మరియు గోస్పాడు మండలం, తేళ్ళపురి గ్రామంలోని శ్రీయాటగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంనందు మంగళ కైశికద్వాదశి మహోత్సవాన్ని  నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్యానర్ ను తి.తి.దే. హిందూ ధర్మ ప్రచార మండలి సభ్యులు టి. వి. వీరాంజనేయరావు, కసెట్టి సుజాత, రిటైర్డ్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ కె. ప్రభాకర్, ఆలయ వ్యవస్థాపకులు బత్తుల శేష పాములేటి తదితరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవంతుని చేరుకోవడానికి కావలసింది కేవలం నిష్కల్మషమైన భక్తి, సత్యవాక్కు మాత్రమేనని, భక్తి కంటే గొప్పది మరొకటి లేదని, కులం, జాతి, ధనం, బలం ఏవీ దైవ సాన్నిద్యాన్ని చేర్చలేవని భక్తి యొక్క మహత్మ్యాన్ని తెలిపే ఈ అపూర్వ పర్వదినం రోజు విష్ణు కథలను విని భగవంతుని కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. ఆరోజు విష్ణు సహస్ర నామ పారాయణం, భజనలు, హనుమాన్ చాలీసా పారాయణం, తీర్థ ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు. ఈకార్యక్రమంలో జె.పద్మలత, టంగుటూరు సత్యనారాయణ, సునంద, సి.పెద్దక్క, బత్తుల పెద్ద సుబ్బరాయుడు, తోట భాస్కర్, ఎం హనుమంతరావు, బచ్చు పెద్ద వీరారెడ్డి, దస్తగిరి రెడ్డి,  ఓరుగంటి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా